Leading News Portal in Telugu

Pawan Kalyan Varahi Yatra: నాలుగో విడత వారాహి యాత్రకు సిద్దమవుతున్న పవన్ కళ్యాణ్


Pawan Kalyan Varahi Yatra: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వారాహి యాత్ర విడత వారీగా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు విడతలు చేపట్టిన వారాహి యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న పవన్‌ కళ్యాణ్‌ నాలుగో విడత యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఈనెల 21వ తేదీన కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేనాని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల టీడీపీ కలిసి ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందన్న ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తన వారాహి యాత్రలో ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డ పవన్‌.. నాలుగో విడత వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు.. ఈ యాత్రకు సంబంధించిన ప్రాంతాల్లో ఉండే సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందని ఎదురు చూస్తు్న్న జనసైనికులు సెప్టెంబర్‌ 21 నుంచి నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభమవుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అరాచక పాలన సాగుతుందని, దాన్ని అంతం చేసేందుకు టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పవన్‌ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైసీపీ పాలన అంతం కోసం ఏ అవకాశం వచ్చినా వదలనని ఆయన గతంలో చెప్పకనే చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా కలిసొచ్చే పార్టీలతో కలిసి వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికోసం ఏదైనా చేస్తానని పదే పదే పవన్‌ చెబుతున్నారు. చంద్రబాబును పరామర్శించిన తర్వాత చేసిన ప్రకటన హాట్‌ టాపిక్‌గా మారింది. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని పవన్‌ ఫుల్ క్లారిటీ ఇవ్వటంతో అటు టీడీపీ నేతలు, ఇటు జనసేన నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.