Leading News Portal in Telugu

Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి!


Plane Crash in Brazil’s Amazon: బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఉత్తర అమెజాన్ రాష్ట్రంలోని బార్సిలోస్‌ ప్రావిన్స్‌లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని అమెజాన్ రాష్ట్ర గవర్నర్‌ విల్సన్‌ లిమా ఎక్స్‌లో తెలిపారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఇక మరణించిన వారిలో అమెరికా పౌరులు కూడా ఉన్నారని కొన్ని బ్రెజిల్ మీడియా సంస్థలు నివేదించాయి. మరణించిన కుటుంబ సభ్యులకు లిమా సానుభూతి తెలిపారు.

అమెజాన్ రాష్ట్ర రాజధాని మనౌస్‌కు 400 కిమీ (248 మైళ్లు) దూరంలో ఉన్న బార్సిలోస్‌ ప్రావిన్స్‌లో ఈ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంకు గురైన విమానం ‘మనౌస్ ఏరోటాక్సీ’ ఎయిర్‌లైన్స్‌కు చెందింది. ప్రమాదం జరిగిందని మనౌస్ ఏరోటాక్సీ ఎయిర్‌లైన్స్‌ ఓ ప్రకటన విడుదల చేసినా.. మరణాల గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. దర్యాప్తుకు అన్ని విధాలుగా తాము సహకరిస్తామని ఎయిర్‌లైన్స్‌ అధికారులు తెలిపారు.