Leading News Portal in Telugu

Hyderabad Rains : హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం


హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం అకస్మాత్తుగా వర్షం కురిసింది. బషీర్‌బాగ్‌, అబిడ్స్, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్‌, మెహదీపట్నం, అఫ్జల్‌గంజ్‌లో వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పాడింది. వాయువ్య బంగాళాఖాతం సహా ఉత్తర ఒడిశా-పశ్చిమ బంగాళాఖాతం తీరాల మీదుగా బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది.

అల్పపీడన ప్రభావంతో రానున్న మరో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్,రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని అధికారులు తెలిపారు.