హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు యూపీఐ పే లేటర్ అనే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ నెట్ వర్క్ ద్వారా బ్యాంకుల నుంచి ముంజురైన క్రెడిట్ లైన్ ద్వారా.. మీ బ్యాంక్ అకౌంట్ లో తగినంత డబ్బులు లేకపోయినా.. మీరు యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. అయితే ప్రస్తుతం ఈ యూపీఐ నౌ, పే లేటర్ సేవలను కేవలం హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు మాత్రమే ప్రారంభించాయి. ఈ రెండు బ్యాంకులు తమ వినియోగదారుల కోసం యూపీఐ పే లేటర్ సేవలను స్టార్ట్ చేశాయి.
వినియోగదారుడి అర్హతను బట్టి హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు ఈ సేవలను అందిస్తున్నాయి. సుమారు రూ. 50 వేల క్రెడిట్ పరిమితితో ఈ సేవలను ఖాతాదారుడికి అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ యూపీఐ నౌ పే లేటర్, ఐసీఐసీఐ పే లేటర్ పేరిట సేవలను అందిస్తుంది. అంతేకాదు ఇప్పటికే యూపీఐకి ఈ ఫీచర్‌ను జోడించాలని ఆర్బీఐ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. రిజ్వర్ బ్యాంక్ అన్ని బ్యాంకులకు పర్మిషన్ కూడా ఇచ్చింది.. కానీ, కొన్ని బ్యాంకులు కస్టమర్‌లకు తమ ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లిమిట్‌ను బట్టీ చెల్లింపులు చేయడంలో సహాయపడేందుకు పే లేటర్ ఆప్షన్ ఇచ్చాయి.
వినియోగదారుల బ్యాంక్ ఖాతా ఖాళీగా ఉన్నప్పటికీ ఈ పే నౌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఎంపిక బై నౌ పే లేటర్ లాగా వర్క్ చేస్తుంది. ఇప్పటి వరకు, యూపీఐని ఉపయోగిస్తున్న వినియోగదారులు వారి సేవింగ్స్ ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలు, ప్రీపెయిడ్ వాలెట్లు , క్రెడిట్ కార్డ్‌లను యూపీఐకి మాత్రమే లింక్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు యూపీఐ లావాదేవీల కోసం క్రెడిట్ లైన్ పరిమితులను వినియోగించుకోవచ్చు. ఈ సేవలు దాదాపు ప్రతి యూపీఐ అప్లికేషన్‌లో ఉంది.
అయితే, బ్యాంకులు క్రెడిట్ లైన్ కోసం కస్టమర్ నుంచి ఆమోదం తీసుకుని.. ఆపై క్రెడిట్ పరిమితిని నిర్ణయిస్తారు. ఖాతాదారులు తమ యూపీఐ యాప్‌లలో పే లేటర్ ఎంపిక చేయొచ్చు.. చెల్లింపు చేసిన తర్వాత.. దాన్ని రికవరీ చెల్లించడానికి బ్యాంక్ మీకు సమయాన్ని కూడా ఇస్తుంది.. దాని కోసం మీరు ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు అని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.