PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజులో 73వ ఏట అడుగుపెట్టారు.రాష్ట్రపతితో పాటు బీజేపీ పార్టీ నేతలు, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రధాని నరేంద్రమోడీకి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేశారు. దేశ నాయకుల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకుల నుంచి విషెస్ వెల్లివెత్తుతున్నాయి.
Wishing PM Narendra Modi a happy birthday.
— Rahul Gandhi (@RahulGandhi) September 17, 2023
అంతకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానికి బర్త్ డే విషెస్ చెప్పారు. మోడీ తన దూరదృష్టి మరియు బలమైన నాయకత్వంతో ‘అమృత్ కాల్’ సమయంలో భారతదేశం ప్రతి రంగంలో అభివృద్ధికి బాటలు వేయాలని ఆమె ఆకాంక్షించారు. న్యూ ఇండియా రూపశిల్పి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. దేశ ప్రాచీన వారసత్వం ఆధారంగా గొప్పి, స్వావలంబన భారతదేశానికి బలమైన పునాది వేశారని అన్నారు.
భారత ప్రతిష్టను పెంచారని జేపీ నడ్డా ప్రశంసించారు. ప్రధాని మోడీ కేవలం భారతదేశానికి కొత్త గుర్తింపు ఇవ్వడమే కాకుండా, ప్రపంచంలో భారత ప్రతిష్టం పెంచారని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొనియాడారు. ఇదిలా ఉంటే తన జన్మదినం రోజున ప్రధాని మోడీ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.