Jogi Ramesh: పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలుకు ములాఖత్‌కు వెళ్లి మిలాఖత్ అయిన పవన్‌కు నైతిక విలువలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి నీ స్థాయి ఎంత, నీ బతుకెంత అని మాట్లాడాడని.. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలను అడిగితే జగన్ స్థాయి ఎంతో చెబుతారని ఆయన అన్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారిని అడిగితే జగన్ స్థాయి ఏంటో చెబుతారన్నారు. సొంతంగా పార్టీని స్థాపించి ఒక్కడే పోరాడి సీఎం అయిన వ్యక్తి అంటూ జగన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఒంటరిగా మొదలై ప్రతిపక్ష నాయకుడిగా 60 మందికి పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారని తెలిపారు.
ఇవాళ దేశం అంతా తన వైపే చూసేలా 151 స్థానాలు సాధించుకుని సత్తా చాటిన వ్యక్తి జగన్ అంటూ మంత్రి జోగి రమేష్ కొనియాడారు. యువరాజ్యం అధ్యక్షుడిగా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చరిత్ర పవన్ కళ్యాణ్‌ది అంటూ విమర్శలు గుప్పించారు. రెండు చోట్ల పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేక పోయిన వ్యక్తి జగన్ స్థాయి గురించి మాట్లాడుతున్నాడని ఆయన విమర్శించారు.