Maharashtra: వారాంతం కావడంతో సరదాగా గడపాలి అనుకున్నారు. అనుకున్నట్టుగానే స్నేహితులంతా బస్సులో బయలుదేరారు. అప్పటి వరకు సంతోషంగా నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న వాళ్ళ జీవితాలలో ఒక్కసారిగా విషాద ఛాయలు కమ్ముకున్నాయి. బుస్స్ ప్రమాదం వాళ్ళ ఆనందాన్ని ఆవిరి చేసింది. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
Road also:Samantha: భగవద్గీత చదువుతున్న సమంత.. పోస్ట్ వైరల్..
వివరాలలోకి వెళ్తే.. మహారాష్ట్ర లోని అమరావతి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వారాంతం కావడం చేత స్నేహితులందరు చికల్ ధర వెళ్లేందుకు ఆదిలాబాద్ జిల్లా భీం పూర్ నుండి బస్సుల్లో బయలు దేరారు. కొంత దూరం ప్రయాణించాక అమరావతి సమీపంలో బస్సు అదుపుతప్పి లోయలో పడి పోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 7 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా బస్సులో భీంపూర్ మండలానికి చెందిన యువకులతో పాటు బ్యాంక్ లో క్యాషియర్ పనిచేసే ఉద్యోగులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటన పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పైన పోలీసులు మాట్లాడుతూ బస్సు లోయలో పడిందని.. దీనితో ముగ్గురు వ్యక్తులు మృతి చెందాగా 7 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని వెల్లడించారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.