Exxeella Education Group ఆధ్వర్యంలో ఇంటర్నేషల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నగరంలోని బంజారాహిల్స్ లో గల హోటల్ తాజ్ డెక్కన్ నందు నిర్వహించడం జరిగింది. దీనిలో 50కి పైగా అంతర్జాతీయ యూనివర్సిటీ ప్రతినిధులు హాజరు కాగా ముఖ్య అతిథిగా Actres Faria మహమ్మద్ Abdullah గారు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఫెయిర్ ను ప్రారంభించారు. అనంతరం Faria మాట్లాడుతూ ఫెయిర్ ను నిర్వహిస్తున్న ఎక్సల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ అరసవిల్లి అరవింద్అ గారికి భినందనలు తెలియచేస్తూ తమని కూడా ఇటువంటి కార్యక్రమం లో భాగం చేసినందుకు సంతోషాన్ని తెలియజేస్తూ విదేశీ విద్య కోసం ప్రయత్నించే చాలా మంది విద్యార్ధులకు ఈ ఫెయిర్ ఒక అద్భుతమైన అవకాశం అని ఈ అవకాశాన్ని విద్యార్థులంతా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్ధుల భవిష్యత్తుకై కృషి చేస్తున్న ఎక్సెల్ల వారిని కొనియాడుతూ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు.
అనంతరం సంస్థ చైర్మన్ అరసవిల్లి అరవింద్ గారు మాట్లాడుతూ ఉన్నతమైన విశ్వవిద్యాలయాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం ద్వారా విద్యార్ధులు తమ భవిష్యత్ కు మంచి పునాదిని వేసుకోగలరని, విదేశాలలో చదవడం వలన చదువుతో పాటుగా విభిన్న సంస్కృతులు తెలుసుకోగలరని మన దేశం లో ఇంకా వృద్ది లోకి రాని ప్రొఫెషనల్ కోర్సులను మరియు గ్రాడ్యుయేషన్ దశలోనే నేర్చుకోవడం ద్వారా విద్యార్ధులు మంచి భవిష్యత్ ను సొంతం చేసుకోగలరని వివరిస్తూ ఫెయిర్ కి విచ్చేసినందుకు యాక్ట్రెస్ Faria Abdullah గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఫెయిర్ లో దాదాపు 500ల మంది విద్యార్థులు పాల్గొని తమకున్న సందేహాలను తీర్చుకోగా, ఫెయిర్ నిర్వహించినందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
మరియు ప్రాసెసింగ్ ఫీజు కి సంబందించి విద్యార్ధులు కట్టిన ప్రాసెసింగ్ ఫీజు అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వార పేద ప్రజలకు విరాళం ఇస్తున్నారు తెలియజేసారు
…ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ ప్రతి 3 నేలలకి వొకసారి వొకసారి విజయవాడ గుంటూరు వైజాగ్ మరియూ హైదరాబాద్ నగరాల్లో నిర్వహిస్తాం అని తేలిపారు.
ఈ కార్య క్రమం లో పాల్గొన్న విదేశీ విద్యాలయాల ప్రతినిధులు కూడా ఇక్కడ విద్యార్థులు చూపుతున్న ఆసక్తి పై హర్షం వ్యక్తం చేసారు.