Leading News Portal in Telugu

CPI Narayana : అంగట్లో అమ్ముడుబోయే సరుకు ఎంఐఎం


సికింద్రాబాద్ కు ఈరోజు అమిత్ షా అనే అచ్చోసిన ఆoబోతు ఒకటి వచ్చిందని, తెలంగాణ గురించి, సాయుధ పోరాటం గురించి మాట్లాడుతోందన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వతంత్ర్య పోరాటంలో కానీ.. తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ బీజేపీకి సంభందించిన ఒక్కరి పేరైన బీజేపీ చెప్పగలదా..? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వారోత్సవాలు జరపాలని డిమాండ్ చేసిన కెసిఆర్ తొమ్మిదేళ్లు అవుతుంది ఎందుకు విలీన వారోత్సవాలు జరపడం లేదు…? అని ఆయన అన్నారు. ఎంఐఎంను చూస్తే కేసీఆర్‌ ప్యాంట్ తడుస్తదని, అంగట్లో అమ్ముడుబోయే సరుకు ఎంఐఎం అని ఆయన అన్నారు. కాసిం రజ్వీ జిన్నకు పుట్టిన విష పిందే ఎంఐఎం అని ఆయన అభివర్ణించారు. మోడీతో కేసీఆర్ రాజీ పడ్డారు అందుకే కవిత లిక్కర్ విచారణ ఆగిపోయిందని ఆయన ఆరోపించారు.

అంతేకాకుండా.. ‘విభజన చట్టంలోని అంశాలు మోడీ ఎందుకు నెరవేర్చడం లేదు..? వైసీపీ, బీఅర్ఎస్, ఎంఐఎంలు మోడీకి తొత్తులుగా ఉన్నాయి.. వేల కోట్లు మింగినొడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటారా…? లిక్కర్ క్వీన్స్ జైలుకు వెళ్లకుండా బయట తిరుగుతారా…? మోడీ దత్త పుత్రులతో కలిసి దేశ సంపదను హోల్ సేల్ గా కొల్లగొట్టారు.. కాంగ్రెస్ పార్టీ రిటైల్ హోల్ సేల్ అవినీతి చేసింది. కాంగ్రెస్ పార్టీ అవినీతి చిల్లర చిలక కొట్టులాంటిది తప్ప బిజెపి పార్టీ లా కాదు.. మోడీ ప్రజా సంపదను కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూన్నారు… సనాతనం గురించి మోడీ ఏం తెలుసు.. భర్త చనిపోతే బార్య చితి మంటలపై కాల్చాలని మోడీ చెబుతారా…? సనాతన ధర్మం ఔట్ డేటెడ్ అని ఆనాడే కృష్ణుడే ఒప్పుకున్నాడు.. మీరు ఒప్పుకొరా..? పేగు బంధం తెలియని హీనులే మతం, సనాతనం గురించి మాట్లాడుతారు. మోడీకి కావలసిన బిల్లులను ఆమోదం చేసుకునేందుకే గిరిజన మహిళను రాష్ట్రపతిగా నియమించారు.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 33 తూములు ఉంటే ఒక్క తూము తెరిచాడు.. ఇక్కడి నుంచి అక్కడికి పోయి కెసిఆర్ మూత్రం పోసి వచ్చినట్టు నీళ్ళు వస్తున్నాయి.. మోడీకి అమ్మ మొగుడు కేసీఆర్…’ అని ఆయన అన్నారు.