Leading News Portal in Telugu

Jawan OTT: సరి కొత్త సీన్స్ తో ఓటీటీ రిలీజ్ చేయనున్న మేకర్స్..


బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్‌.సెప్టెంబర్‌ 7న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్‌ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతుంది.ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా విడుదల అయిన 10 రోజులకు కలిపి ప్రపంచ వ్యాప్తంగా 797.50 కోట్ల వసూళ్లు వచ్చినట్లు జవాన్‌ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాకు సౌత్ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వం వహించారు.అలాగే ఈ సినిమాలో షారుఖ్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే దీపికా పదుకొనే, ప్రియమణి, విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ మరియు యోగిబాబు వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించారు.. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై గౌరీఖాన్‌ జవాన్‌ ను నిర్మించారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ అద్భుతమైన మ్యూజిక్ అందించారు..

థియేటర్లలో అదరగొడుతున్న జవాన్‌ మూవీ ఓటీటీ రిలీజ్‌ గురించి ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై డైరెక్టర్‌ అట్లీ స్పందించారు. షారుక్‌ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్‌ ను అందించారు అట్లీ . ‘సరైన రన్‌ టైమ్‌, ఎమోషనల్‌ సీన్లతో జవాన్‌ ను థియేటర్లలో మేము విడుదల చేశాం. అయితే ఓటీటీ రిలీజ్‌కు వచ్చే సరికి ఇంకొన్ని సీన్లు కూడా యాడ్‌ చేయాలనుకుంటున్నాం. అందుకే హాలీడేకు వెళ్లకుండా ఇప్పుడు దీనిపైనే నేను వర్క్‌ చేస్తున్నాను. ఓటీటీలో ప్రేక్షకులని జవాన్‌ సినిమా కచ్చితంగా సర్‌ప్రైజ్‌ చేస్తుంది.’అని చెప్పుకొచ్చారు డైరెక్టర్‌ అట్లీ. అయితే జవాన్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్ ఎప్పుడనే దానిపై మాత్రం ఆయన స్పందించలేదు.షారుక్‌ జవాన్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇందుకోసం సుమారు రూ. 250 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తుంది… దీపావళి కానుకగా ఈ సినిమా ను నెట్‌ఫ్లిక్స్‌ లో రిలీజ్ చేసే ఛాన్సు ఉన్నట్లు తెలుస్తుంది