Leading News Portal in Telugu

Malla Reddy: పిల్లలకు 500 నోటు చేతిలో పెట్టిన మల్లన్న.. కండిషన్స్ అప్లై


Malla Reddy: తెలంగాణ రాజకీయాల్లో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి ఎంతో పేరుంది. అది అందరికీ తెలుసు. తెలంగాణ రాజకీయాలే కాదు, సోషల్ మీడియాపై మంచి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ మంత్రి మల్లన్న సుపరిచితమే. ఆయన ప్రసంగం, డైలాగులు అలానే ఉంటాయి మరి. సోషల్ మీడియాలో కూడా మల్లన్న బాగా ట్రెండ్ అయ్యాడు. ‘పాలమ్మిన్నా.. పూలమ్మిన్నా.. బోర్‌ వెల్‌ లెడ్‌.. హార్డ్‌ వర్క్‌.. మైక్‌ దొరికితే చాలు.. పార్టీ మీటింగ్‌ అయినా.. అసెంబ్లీ అయినా.. అక్కడక్కడా… అంటూ మల్లన్న కష్టపడి పనిచేసిన తీరును వివరిస్తూ అందరినీ తనదైన శైలిలో చైతన్యపరిస్తూ తనదైన శైలిలో నవ్విస్తూ ఉంటారు. అప్పటి వరకు సీరియస్‌గా ఉన్న వాతావరణాన్ని నవ్విస్తుంటారు. మల్లన్న ఎక్కడుంటే అక్కడ జోష్ ఉంటుందని తెలుపుతుంటారు.

Read also: Delhi : అనుమానమే ఆ మహిళ ప్రాణం తీసింది

నిత్యం వార్తల్లో నిలిచే మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. చిన్న పిల్లలకు డబ్బులు పంచుతున్న వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మంత్రి మల్లారెడ్డి ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బోడుప్పల్ లోని వీరారెడ్డి కాలనీకి వెళ్లారు. ఆయనను చూసిన కొందరు చిన్నారులు మంత్రి మల్లారెడ్డి వద్దకు వెళ్లారు. ‘ వినాయక చవితి.. వినాయకుడిని పెడుతున్నాం.. చందా ఇవ్వండి సార్’ అంటూ పిల్లలు చుట్టుముట్టారు. వారి బుడి బుడి మాటలకు సంతోషించిన మల్లారెడ్డి వెంటనే తన జేబులో చేయి వేసి రూ.500 నోట్ల కట్టలను బయటకు తీసి చిన్నారులకు డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఒక్కొక్కరికి రూ. 500 పిల్లలకు పంపిణీ చేస్తూ ఈ డబ్బును ఏం చేస్తారు అని ప్రశ్నించారు. పిల్లలు నవ్వుతూ ఏం చేయాలి అంటే వినాయక చవితి కదా దేవుడు దగ్గర పెట్టండి అంటూ కండిషన్స్ పెట్టారు మల్లన్న. దేవుడే దగ్గరే పెడతారా ఈ డబ్బులు దేనికైనా ఉపయోగిస్తారా? అంటూ ప్రశ్నిస్తే ఆ.. దేవుడే పెడతాం అంటూ పిల్లలు సమాధానం ఇచ్చారు. ఆ తరువాత డబ్బులు తీసుకున్న పిల్లలు సంతోషించి జై మల్లన్న అంటూ నినాదాలు చేశారు. వారి నినాదాలు విని మంత్రి మల్లన్న కూడా చలించిపోయారు. సరే సరే వెల్లండి అంటూ చిన్నారులతో కాసేపు ముచ్చటించి అక్కడి నుంచి మల్లారెడ్డి వెళ్లిపోయారు.
Rohit Sharma: ఏళ్లు గడిచినా ఈ విజయంను మరిచిపోలేం.. ఈ క్రెడిట్ సిరాజ్‌దే: రోహిత్ శర్మ