Leading News Portal in Telugu

Minister Jagdish Reddy: కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష


తుక్కుగూడ సభలో కాంగ్రెస్ హామీలపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు బోగస్ హామీలు అంటూ ఆయన విమర్శించారు. ప్రజలను మోసగించడం కాంగ్రెస్ పార్టీ అలవాటు.. ఇచ్చిన హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ కు లేదు.. దేశంలో ఆకలి దారిద్ర్యాలకు కారణం కాంగ్రెస్ పార్టీనే అని మంత్రి వ్యాఖ్యనించారు. అబద్ధాపు హామీలు ఇచ్చే అలవాటు లేని నేత కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక్కటి కూడా అమలు చేయగలిగినవి లేవు అని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు ఏలుతున్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా నిన్న ( ఆదివారం ) ప్రకటించిన పథకాలు లేవు అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలు ప్రజలను మోసగించాలని చూస్తుంది అని ఆయన వెల్లడించారు. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజల ముందు.. కాంగ్రెస్ పాచికలు పారవు.. సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మంత్రి పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేసేందుకు వీలు కాదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్-బీజేపీ పార్టీలు కేసీఆర్ పై అసత్య ప్రచారం చేస్తున్నారు.. దీన్ని తెలంగాణ సమాజం వారి మాటలను నమ్మో పరిస్థితిలో లేదు అంటూ ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తుంది.. ఇక, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశాడు.