Leading News Portal in Telugu

Ishan Kishan: కోహ్లీ ఎలా నడుస్తాడో చూపించిన ఇషాన్ కిషన్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు


Ishan Kishan: ఆసియా కప్ 2023 ఫైనల్ లో శ్రీలంకను భారత్ చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. శ్రీలంక జట్టు 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం 51 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన.. టీమిండియా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 6.1 ఓవర్లలోనే టార్గెట్ ను చేధించి.. 8వ సారి ఆసియా కప్ టైటిల్ ను ముద్దాడారు.

అయితే మ్యాచ్ అనంతరం టైటిల్ ప్రజేంటేషన్ వేళ.. ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కింగ్ కోహ్లీ వాకింగ్ స్టైల్ ను యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఎలా నడుస్తాడో నడిచి చూపించాడు. ఈ వీడియోను చూస్తే.. మీరు నవ్వు ఆపుకోలేరు. ఆ వీడియోలో ఇషాన్ కిషన్ అచ్చం కోహ్లీలానే నడిచాడు. అక్కడే ఉన్న ఇతర క్రికెటర్లు ఇషాన్ కిషన్ నడిచే విధానాన్ని చూసి పడీ పడీ నవ్వారు. అయితే కోహ్లీ మాత్రం “నా నడక అలా ఉండదు” అంటూ ఇషాన్ కిషన్ కు చెప్పగా.. మరోసారి కోహ్లీలా నడిచి చూపించాడు. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.