Leading News Portal in Telugu

Minister KTR: రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్


ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ విభజన సరిగ్గా జరుగలేదని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని అవమానకర వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు.. చారిత్రక వాస్తవాల పట్ల ఆయనకున్న నిర్లక్ష్యానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమేనంటూ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధన కోసం ఆరు దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పోరాడారు.. జూన్ 2, 2014న రాష్ట్ర అవతరణ కల సాకారం చేసుకున్నారు అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.

అయితే, అంతకు ముందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఏపీ, తెలంగాణ విభజనపై వ్యాఖ్యనించారు. యూపీఏ హయాంలో ఈ పార్లమెంట్ లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని.. అయితే ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మాదిరిగా ఏపీ, తెలంగాణ విభజన సరిగ్గా జరుగలేదని ఆయన కోనియాడారు. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు మూడు రాష్ట్రాల విభజన ఎంతో ప్రణాళికా బద్ధంగా చేశారని మోడీ తెలిపారు. ఆ మూడు రాష్ట్రాల విభజన టైంలో అన్ని చోట్లా సంబరాలు జరిగాయన్నారు.

ఏపీ, తెలంగాణ విభజన టైంలో ఎక్కడా సంబరాలు జరుగలేదు అని ప్రధాని మోడీ అన్నారు. స్వార్థ రాజకీయాల కోసమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను హడావుడిగా విభజించారన్నారు. అత్యంత దారుణంగా ఏపీని విభజించారన్నారు. మైకులు ఆపేసి, పెప్పర్ స్ప్రే జల్లి అత్యంత సిగ్గుచేటుగా చేశారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారు.. అయినా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో సెలబ్రేషన్స్ జరుగలేదు.. విభజన అంశంలో ఎలాంటి చర్చ జరపకుండానే ఏపీ, తెలంగాణ విభజన చేసి కాంగ్రెస్ పార్టీ చేతులు దులుపుకుందని ప్రధాని మోడీ ఆరోపించారు. ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ చాలా కీలకం.. అలాంటి వ్యవహారాన్ని తూతు మాత్రంగా చేశారన్నారు.