Leading News Portal in Telugu

EVM Ganpati : ఈవీఎం గణపతి.. ఓటర్‌ ఐడీలు పట్టుకుని క్యూ కట్టిన మూషికాలు..


EVM Ganpati : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాల్లో మునిగిపోయారు భక్తులు.. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాది గణేష్‌ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.. ఇంట్లో.. గల్లీలో.. వీధిలో.. ఊరులో.. వాడలో ఇలా పల్లె, పట్టణం, నగరం తేడా లేకుండా ఘనంగా వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న రీతుల్లో దర్శనం ఇస్తున్నారు వినాయకులు.. విశాఖలో ఈసారి విభిన్న వినాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.. ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేస్తూ విశాఖలోని తాటి చెట్ల పాలెం లో ఈవీఎం వినాయకుడు కాన్సెప్ట్ భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంది..

ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యత తెలిజేసేలా.. ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించేలా.. పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఎలక్షన్ ను నిర్వహించారు యువసేన ఫౌండేషన్.. మూసికాలను ఓటర్లుగా నిలబెట్టి స్వతంత్ర అభ్యర్థి వినాయకుడే లోకనాయకుడు అనే నినాదంతో వినాయక చవితి నిర్వహిస్తున్నారు.. ఈ కాన్సెప్ట్ వినాయకుడిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు.. ఈవీఎం వినాయకుడు కాన్సెప్ట్ తో ఓటు హక్కు ప్రాముఖ్యత, పోలింగ్ స్టేషన్ ఎలక్షన్ జరుగు విధానాన్ని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బొజ్జ గణపయ్యని భక్తుల ముందుకు తీసుకు వచ్చిన భక్తుడు యువసేవ ఫౌండేషన్ పీలా హరిప్రసాద్‌గా చెబుతున్నారు.. మొత్తంగా ఎన్నికలకు ముందు వచ్చిన వినాయక చవితిని పురస్కరించుకుని ఓటర్లను చైతన్యం కలిగించేలా తీసుకొచ్చిన ఈ కాన్సెఫ్ట్‌ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

మరోవైపు అనకాపల్లి జిల్లా, యలమంచిలి.. ఏటికొప్పక గ్రామంలో వినాయక చవితి సందర్భంగా లక్క బొమ్మలు తయారుచేసే చింతల లావణ్య ఒక అంగుళం ఎత్తు పరిమాణంలో ఒక వినాయకుడిని తయారు చేశారు. ఈ బొమ్మ తయారు చేయడానికి రెండు రోజులు పట్టిందని చెబుతున్నారు.. ఈ బొమ్మ తయారీలో అంకుడు చెక్కను మరియు ప్రకృతి రంగులను ఉపయోగించారు. ఏటికొప్పాక లక్క బొమ్మల తయారీలో మగ వారి లాగానే మహిళలు కూడా ఈ బొమ్మల తయారీలో నైపుణ్యం సంపాదించాలనే ఉద్దేశంతో ఈమె 150 మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నారు.

Whatsapp Image 2023 09 18 At 4.00.47 Pm