Leading News Portal in Telugu

Vinayaka Festival: ప్రగతి భవన్‌లో వినాయక చవితి వేడుకలు..


వినాయక చవితి పండగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మట్టి గణపతిని ఏర్పాటు చేసి.. ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. అనంతరం కేసీఆర్ దంపతులతో పాటు కేటీఆర్, శైలిమ దంపతులు పూజలు చేశారు. ఈ పూజ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి తదితరులు హాజరైనారు.

ఇక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక ఉత్సవాలు ఘనంగా కొనసాగుతుంది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ మహాగణపతి దగ్గర భక్తుల సందడి కొనసాగుతుంది. ఈరోజు ఖైరతాబాద్ గణనాథునికి తొలిపూజను వైభవంగా చేశారు. ఈ రోజు జరిగిన తొలి పూజ కార్యక్రమంలో తెలంగాణ, హర్యానా గవర్నర్లు తమిళిసై సౌందర్‌రాజన్, బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బడా గణనాథునికి పట్టువస్త్రాలు సమర్పించారు.