DK Aruna: మహిళ బిల్లును కవిత కోసమే మోడీ పెడుతున్నట్టు మాట్లాడుతుందని ఎమ్మెల్సీ కవితపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. కేసులను తప్పు దోవ పట్టించేందుకు నాటకాలు ఆడకు అంటూ మండిపడ్డారు. బీజేపీ ఇచ్చిన హామీలనే మోడీ నెరవేరుస్తున్నారని తెలిపారు. కేసీఆర్, కవితలు మాట్లాడడం విచారకరం అన్నారు. అసెంబ్లీ సీట్లలో మహిళలకు ఎన్ని ఇచ్చారు? అంటూ ప్రశ్నించారు. మహిళ అయిన తన పైన అడ్డగోలుగా మీ నాయన మాట్లాడారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కి మహిళల పట్ల ఉన్న గౌరవం ఇది అంటూ మండిపడ్డారు. మీ నాన్నకి చెప్పు మహిళలను గౌరవించమని అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారం లోకి వస్తుందన్నారు. తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తేనే పేదలతో సహా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మోడీ భారత ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటుతుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతుందని అన్నారు.
Read also: Health Tips : మీరు రోజూ చాక్లేట్ తింటారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..
దేశంలో మత చిచ్చు, వైసమ్యాలు సృష్టిస్తుంది కాంగ్రెస్ అంటూ మండిపడ్డారు. సనాతన ధర్మం లేకుండా చేయాలని కాంగ్రెస్ చూస్తుందన్నారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారని తెలిపారు. కర్ణాటకలో 4 వేల పెన్షన్ ఇస్తున్నారా? అంటూ మండిపడ్డారు. అభివృద్దికి నిధులు ఉండవని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అధికారం కోసమే కాంగ్రెస్ హామీలు… అమలు కోసం కాదని మండిపడ్డారు. దేశం కోసం, రాష్ట్రం కోసం ఎప్పుడైనా ఆలోచన చేశారా? వాళ్ళు మూడు గ్యారంటీలు ఇవ్వాలన్నారు. మా ఎమ్మేల్యేలు పార్టీ మారారని అన్నారు. అధికారంలోకి వస్తే స్కాం లు ఉండవన్నారు. తెలంగాణ చరిత్రను తప్పి దారి పట్టించమని గ్యారంటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశం, రాష్ట్రాల అభివృద్ది ధ్యేయంగా బీజేపీ, మోడీ ప్రభుత్వం పథకాలు తీసుకొస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల నెరవేరే విధంగా బీజేపీ మేనిఫెస్టో ఉంటుందన్నారు.
Bigg Boss Telugu 7: నామినేషన్స్ లో టాప్ కంటెస్టెంట్స్.. ఈ వారం వెళ్ళేది?