Old Parliament: దశాబ్ధాల చరిత్ర కలిగిన పార్లమెంట్ భవనం నేటితో రిటైర్ కాబోతోంది. ఎన్నో రాజకీయాలకు సాక్ష్యంగా మిగిలిన పాత పార్లమెంట్ భవనంలో ఇకపై అధ్యక్ష అనే మాటలు వినిపించవు. ఈ రోజు కొత్త పార్లమెంట్ భవనంలోకి సభ మారబోతోంది. ఈ రోజు ఉభయ సభల ఎంపీలు పాత పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకాయి. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు ప్రతిపక్ష నాయకులు పార్లమెంట్ ని ఉద్దేశించి మాట్లాడారు.
ఉభయ సభలు కొత్త పార్లమెంట్ భవనానికి మారిన తర్వాత పాత పార్లమెంట్ భవనం అని పిలుస్తూ దాని విలువ దిగజార్చవద్దని, పాత భవనానికి ‘సంవిధాన్ సదన్’ అని పేరు పెట్టాలని ప్రధాని మోదీ మంగళవారం సూచించారు. గత 75 ఏళ్లుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న భవనాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సంవిధాన్ సదన్ అని పేర్కొనడం పార్లమెంట్ చరిత్ర సృష్టించిన నాయకులకు నివాళులు అర్పించినట్లు అవుతుందని ప్రధాని అన్నారు. భవిష్యత్ తరాలకు ఈ విషయాన్ని తెలియజేయాల్సిన అవసరాన్ని మనం వదులుకోకూడదని అన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కొత్త భవనానికి మారే ముందు జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు.