Leading News Portal in Telugu

Ashtadigbandanam: ప్రేక్షకులను ‘అష్టదిగ్బంధనం’ చేసేలా కథ, కథనాలు.. అదే హైలైట్ అంటున్న మేకర్స్!


Ashtadigbandanam Director Baba Pr Producer Manoj Kumar Interview: బాబా పి.ఆర్‌. దర్శకత్వంలో ఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్‌ సమర్పణలో మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ నిర్మించిన ‘అష్టదిగ్బంధనం’ ఈనెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య, విషిక జంటగా నటించిన ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ‘అష్టదిగ్బంధనం’ దర్శక, నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబా పి.ఆర్‌, మనోజ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ముందుగా అష్టదిగ్బంధనం అనేది చాలా పవర్‌ఫుల్‌ టైటిల్‌ కదా.. దీన్ని ఎలా జస్టిఫై చేస్తారని అడిగితే బాబా పి.ఆర్‌ మాట్లాడుతూ అష్టదిగ్బంధనం అనేది చాలా పవర్‌ఫుల్‌ టైటిల్‌ అన్నది నిజమే అని అన్నారు. అందుకే ఈ సినిమాలో దాన్ని జస్టిఫై చేసేలా ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకున్నామని, టైటిల్‌కు తగ్గట్టుగానే ఇందులోని ప్రతి క్యారెక్టర్‌ అవతలి వారిని అష్టదిగ్బంధనం చేయాలని చూస్తుంటారని, ఇలా పలువురు వ్యక్తుల స్వార్ధంతో కూడిన జీవితాలకు సంబంధించినదే ఈ కథ అని అన్నారు.

NTR: బాలకృష్ణతో ఎన్టీఆర్.. అది జరగదమ్మా.. ?

ఈ సినిమా యాక్షన్‌, థ్రిలర్స్‌ను ఎక్కువగా ఇష్టపడే వారికి బాగా కనెక్ట్‌ అవుతుందని, అలాగని ఇతర వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోలేదు అని కాదు అన్ని వర్గాల వారినీ దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది అని అన్నారు. మొదటి ట్రైలర్‌లో కొంత యాక్షన్‌ పార్ట్‌ ఎక్కువగా చూపించడం వల్ల మీకు హింస ఎక్కువ అనిపిస్తోంది కాలనీ సినిమాలో అందరినీ ఆకట్టుకునే అంశాలు ఉంటాయని అన్నారు. కొత్త ఆర్టిస్ట్‌లతో రిస్క్‌ అనిపించలేదా? అని అడిగితే కథలో విషయం ఉంటే, ఆర్టిస్ట్‌లు ఆటోమేటిక్‌గా పెర్ఫార్మ్‌ చేస్తారు, ఇందులో కూడా కొత్తవారైనా ఆర్టిస్ట్‌లు అందరూ ఎక్స్‌పీరియెన్స్‌డ్‌గా కనిపిస్తారని అన్నారు. ఈనెల 22న మీరు థియేటర్‌కు వచ్చి సినిమా చూడండి. మీరు కొన్న టిక్కెట్‌ రేట్‌కు మరిన్నిరెట్లు సంతృప్తినిస్తుందని ఆయన అన్నారు.

ఇక నిర్మాత మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ ని నిర్మాతగా తొలి ప్రాజెక్ట్‌కే ఇంత రిస్క్‌ సబ్జెక్ట్‌ ఎంచుకోవడం ఎందుకు అని అడిగితే ఇది స్క్రీన్‌ప్లే బేస్డ్‌ సినిమా, కథను వినగానే చాలా ఎగ్జైట్‌ ఫీలయ్యానని అన్నారు. ఇలాంటి కథతో నిర్మాతగా మారుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక రిస్క్‌ అంటారా.. కథలో ఉన్న బలం ఆ రిస్క్‌ను తీసుకోవటానికి నన్ను ఎంకరేజ్‌ చేసిందని, ప్రేక్షకులను ‘అష్టదిగ్బంధనం’ చేసే కథ, కథనాలు సినిమా హైలైట్‌ అని అన్నారు. బడ్జెట్‌ విషయంలో ఇబ్బంది పడ్డారా అని అడిగితే ముందే ఈ సినిమాకు బడ్జెట్‌ ఎంత అనేది ఫిక్స్‌ అయ్యాం, దాన్ని బట్టి ముందుకు వెళ్లామని ఎక్కడా ఓవర్‌ బడ్జెట్‌ అవలేదని అన్నారు. కథ మీద ఉన్న నమ్మకమే నన్ను ముందుకు నడిపిందని పేర్కొన్న ఆయన సినిమాను సినిమాగా తీస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని, వారికి కావాల్సిన అన్ని అంశాలు జాగ్రత్తగా ఇమడ్చగలిగితే ఖచ్చితంగా సక్సెస్‌ వస్తుందని అన్నారు. దర్శకుడు బాబాగారు ముందు చెప్పిన దానికన్నా అద్భుతంగా తీశారని ఆయన అన్నారు