High Interest: పేద, సామాన్య ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ బిందాస్ గా వడ్డీ వ్యాపారాన్ని సాగిస్తూ పేద ప్రజలను దోచుకుంటున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో సామాన్య కుటుంబం బతకడం కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి, పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్లు తదితర అత్యవసర అవసరాల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకుని వడ్డీ వ్యాపారులు వేలల్లో ఉంటే ప్రామిసరీ నోటు, లక్షల్లో ఉంటే ఆస్తి పత్రాలు ఉంచుకుని రూ.3 నుంచి రూ.10 వరకు వడ్డీకి డబ్బులు ఇస్తున్నారు. దీంతో తీసుకున్న అప్పుకు అసలు, వడ్డీ, వడ్డీ, చక్రవడ్డీ, వడ్డీ కట్టలేక, ఆస్తులు విడిపించుకోలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చాలా మంది వడ్డీ వ్యాపారుల ఊబిలో కూరుకుపోయి అప్పులు తీర్చలేక సతమతమవుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తాజాగా నగరంలో ఓ ప్రైవేట్ ఫైనాన్షియర్ దాడిలో మాజీ హోంగార్డు మృతి చెందాడు.
Read also: DK Aruna: మహిళ బిల్లును కవిత కోసమే మోడీ పెడుతున్నట్టు మాట్లాడుతుంది..! కవితపై డీకే అరుణ ఫైర్..
ఐఎస్ సదన్ భానునగర్ కు చెందిన మాజీ హోంగార్డు మహ్మద్ రిజ్వాన్ ఓ ప్రైవేట్ ఫైనాన్షియర్ వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. ఇటీవలి కాలంలో అసలు, వడ్డీతో అప్పు చెల్లించాడు. అయితే రెండు రోజుల క్రితం నాంపల్లికి చెందిన ఓ ముఠా ఐఎస్ సదన్ నుంచి రిజ్వాన్‌ను కిడ్నాప్ చేసి నాంపల్లిలోని ఓ భవనంలో ఉంచింది. రెండు రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేసింది. విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి రూ. 2 లక్షలు చెల్లించి కొడుకును విడిపించుకున్నాడు. పోలీసులకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో తండ్రి ఫిర్యాదు చేయలేకపోయాడు. నిందితుల దెబ్బలు తట్టుకోలేక బాధితుడిని ఇంటికి తీసుకొచ్చి ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రిజ్వాన్ మృతి చెందడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకు చిత్రహింసల వల్లే చనిపోయాడని ఓ ప్రైవేట్ ఫైనాన్షియర్ పై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Health Tips : మీరు రోజూ చాక్లేట్ తింటారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..