
Being Infected With Covid Indian origin man Coughing on Colleagues Jailed in Singapore: సింగపూర్ లో దగ్గినందుకు ఓ వ్యక్తికి జైలు శిక్ష పడింది. అదేంటి దగ్గితేనే జైలు శిక్ష పడిందా అని అనుకుంటున్నారా? అయితే దాని చాలా పెద్ద కారణమే ఉంది. కరోనా ప్రపంచ వ్యాప్తంగా ఎంత భయందోళనలు క్రియేట్ చేసిందో తెలిసిందే. దీని వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కూడా. ఇదిలా వుండగా తమిళ్ సెల్వం అనే వ్యక్తి సింగపూర్‌లోని ఓ కంపెనీలో క్లీనర్‌గా పని చేస్తున్నాడు. అయితే అతడికి 2021 లో ఆరోగ్యం పాడయ్యింది. అప్పట్లో కోవిడ్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉండటంతో అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దాంట్లో అతడికి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో టెస్ట్ ల అనంతరం అతడు ఇంటికి వెళ్లిపోకుండా తన ఆఫీసుకు వచ్చాడు. అయితే తనకి కోవిడ్ సోకింది సెలవు కావాలని తెలిపేందుకు అతడు ఆఫీసుకు వెళ్లాడు. అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాని ఆఫీస్ సిబ్బంది సూచించాడు. అయినా తమిళ్ సెల్వం వెళ్లకుండా అక్కడక్కడే తిరిగాడు.
Also Read: Chiranjeevi on ANR : భారతీయ సినీ చరిత్రలోనే దిగ్గజ నటుడు.. ప్రేక్షక హృదయాల్లో నిలిచిన నట సామ్రాట్
అంతేకాకుండా అక్కడ పలుమార్లు దగ్గాడు కూడా. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది చాలా ఇబ్బందికి గురవడంతో పాటు చాలా భయపడింది. అయితే, ఘటన తర్వాత ఎవరికీ కరోనా సోకలేదు కానీ.. తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అందుకే అక్కడ పనిచేసే ఉద్యోగుల్లో కొందరు అతనిపై ఫిర్యాదు చేశారు. ఆఫీసులో కిడ్నీ వ్యాధితో బాధపడేవారు కూడా ఉన్నారని వారికి తమిళ్ సెల్వం నిర్లక్ష్యం వల్ల కరోనా సోకి ఉంటే పరిస్థితి తీవ్రంగా మారేదని, ఎంత చెప్పినా వినకుండా అతడు అక్కడే ఉన్నారని ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసుుకున్న పోలీసులు అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించగా అతడు పలుమార్లు దగ్గడం కనిపించింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అన్ని విషయాలను పరిశీలించిన కోర్టు 64 సంవత్సరాల తమిళ్ సెల్వంకు రెండు వారాల జైలు శిక్ష విధించింది. సదరు వ్యక్తి కరోనా నిబంధనలు పాటించకుండా.. సహోద్యోగులను ఇబ్బందులకు గురి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ శిక్ష విధించినట్లు పేర్కొంది. సింగపూర్‌లో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు కనీసం ఆరు నెలల జైలు శిక్షతో పాటు 10వేల సింగపూర్ డాలర్లు జరిమానా విధించేలా నిబంధనలు ఉన్నాయి. అయితే ఇతడికి కేవలం రెండు వారాలే శిక్ష విధించడం అనేది ఆనందపడాల్సిన విషయం అనే పేర్కొనాలి.