Leading News Portal in Telugu

AP BJP: మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏపీ బీజేపీ మహిళా నేతల సంబరాలు


విజయవాడలోని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర మహిళా నేతలు సంబరాలు చేసుకున్నారు. చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. బాణా సంచా పేల్చి, మోడీ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసిన మహిళలు.. బీజేపీ మహిళా మోర్చా నేతలు.. దశాబ్దాల కలను ప్రధాని మోడీ సాకారం చేశారు అంటూ ఆనందం వ్యక్తం చేశారు. నారీ శక్తి బంధనం పేరుతో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు.. 33శాతం రిజర్వేషన్ ద్వారా మహిళలు పాలనా నిర్ణయాల్లో పాలు పంచుకుంటారు అంటూ వారు పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించారు అంటూ ఏపీ భారతీయ జనతా పార్టీ మహిళా నేతలు విమర్శించారు. వాళ్ళ వల్లే మహిళా బిల్లు వచ్చిందని కొన్ని పార్టీలు చెప్పుకోవడం వింతగా ఉంది అని కామెంట్స్ చేశారు. అన్ని వర్గాల మహిళలకు సమన్యాయం చేసే అవకాశం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కల్పించారు.. వచ్చే పాతికేళ్లల్లో మహిళాభివృద్దిని దేశ ప్రజలు చూస్తారు అంటూ మహిళా నాయకురాళ్లు అన్నారు.

చాలా కాలం నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ.. దాని మిత్రపక్షాలు కలిసే అడ్డుకున్నాయని ఏపీ బీజేపీ మహిళా నేతలు ఆరోపించారు. అందువల్లే మహిళలు వెనకబడి ఉన్నారు.. ఇప్పుడు ప్రధాని మోడీ తీసుకొచ్చిన ఈ బిల్లుతో దేశంలో మహిళలకు సముచిత స్థానం కల్పించి బీజేపీ మహిళలపై ఉన్న చిత్తశుద్దిని చాటుకుందని వారు పేర్కొన్నారు.