
Bengaluru: బెంగళూర్ లో గొడ్డుమాంసం దొంగతనానికి దొంగలు మాస్టర్ ప్లాన్ చేశారు. ఏకంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తల ముసుగులో బీఫ్ మాంసాన్ని దోపిడి చేశారు. ఇందులో కీలక నిందితుడు గొడ్డుమాంసాన్ని అమ్మే వ్యక్తిగా తేల్చారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలమని చెప్పుకుంటూ గొడ్డు మాంసాన్ని దోచుకోవడం, కిడ్నాపులకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తుల్ని కర్ణాటక పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
దీంతో కీలక వ్యక్తిగా ఉన్న మహ్మద్, అతని ముగ్గురు సహచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జావేద్ అనే వ్యక్తి రామనగర నుంచి బెంగళూర్ లోని తిలక్‌నగర్ ప్రాంతానికి బీఫ్ ని సరఫరా చేస్తుంటాడు. నిందితుడు మహ్మద్ కి కూడా మాంసాన్ని సరఫరా చేస్తుంటాడు. అయితే సెప్టెంబర్ 10న జావెద్ ని కిడ్నాప్ చేసి, అతడి వాహనాన్ని నలుగురు నిందితులు దొంగిలించారు.
Read Also: Amit Shah: మహిళల కోసం మగాళ్లు మాట్లాడకూడదా..? కాంగ్రెస్‌పై అమిత్ షా విమర్శలు..
బెంగళూరులోని మైకో లేఅవుట్ సిగ్నల్ సమీపంలో మహ్మద్‌కు చెందిన ముగ్గురు సహచరులు తమను తాము ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలమని చెప్పుకుంటూ వాహనాన్ని అడ్డగించారు. నిందితులు వాహనంతో పాటు జావేద్‌ను కిడ్నాప్ చేశారు. జావెద్ ని విడిపించేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. చివరకు రూ.10,000 తీసుకుని వదిలిపెట్టారు. జావెద్ వాహనం వేరే ప్రాంతంలో ఉందని, అక్కడి నుండి తీసుకెళ్లాలని నిందితులు చెప్పారు, అయితే వాహనం దొరికిన అందులో మాంసం మాయమైంది. ఈ విషయమై ఆడుగోడి పోలీస్ స్టేషన్ లో జావెద్ ఫిర్యాదు చేశారు. కేసును విచారించగా మహ్మద్, అతని సహచరులు నేరం చేసినట్లు ఒప్పుకున్నారు.