ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గత రెండు రోజుల కిందట అస్వస్థతకు గురయ్యారు. దీంతో మణిపాల్ హాస్పిటల్ డాక్టర్లు ఆయనకు అపెండెక్టమీ సైతం రోబో సాయంతో చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను డాక్టర్లు డిశ్ఛార్జ్ చేశారు. ఈ మేరకు మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపుడి తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే, గవర్నర్ అబ్దుల్ నజీర్ కడుపునొప్పితో సోమవవారం తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. డాక్టర్లు ప్రాథమిక వైద్య పరీక్షలు చేయగా.. మెడికల్ టెస్టుల్లో గవర్నర్ అక్యూట్ అపెండిసైటిస్ తో బాధ పడుతున్నారని నిర్దారించారు. దీంతో గవర్నర్ అబ్దుల్ నజీర్ కు రోబో సహాయంతో అపెండెక్టమీ అనే సర్జరీ చేసినట్లు మణిపాల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సర్జరీ సక్సెస్ కావడంతో పాటు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా

Health Bulten
ఉందని హెల్త్ బులెటిన్ లో డాక్టర్లు వెల్లడించారు.