Leading News Portal in Telugu

Akkineni Nagarjuna: తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన నాగ్.. ఆయనే మా ప్రాణం


Akkineni Nagarjuna: అక్కినేని.. ఒక బ్రాండ్. ప్రస్తుతం అక్కినేని కుటుంబం మొత్తాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అంటే దానికి కారణం.. ఒక మహావృక్షమైన అక్కినేని నాగేశ్వరరావు వలనే. ఆయన వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున.. ఇప్పుడు నాగ్ వారసులుగా అడుగుపెట్టిన చైతన్య, అఖిల్.. ఇలా ఈ వంశ వృక్షం కొనసాగుతూనే ఉంటుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండమని పెద్దలు చెప్పిన మాటలను తూచాతప్పకుండా పాటించేవారట ఏఎన్నార్. తమ పిల్లలను కూడా అలాగే పెంచారు. ఇక నేడు ఏఎన్నార్ శతజయంతి.. ఈ వేడుకను అక్కినేని కుటుంబం ఎంతో ఘనంగా నిర్వహించారు. అక్కినేని నాగేశ్వరరావు పంచలోహ విగ్రహాన్ని.. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆవిష్కరించారు. ఇక ఈ వేడుకకు సినీరాజకీయ ప్రముఖులు విచ్చేసి.. ఏఎన్నార్ తో ఉన్న గత స్మృతులను స్మరించుకున్నారు.

Rashmika Mandanna: రష్మికను చూసి ముఖం తిప్పుకున్న ప్రభాస్ హీరోయిన్..

ఇక తండ్రి గురించి మాట్లాడుతూ నాగ్ ఎమోషనల్ అయ్యాడు. “నేను ఏ విగ్రహాం చూసినా.. ఆయన గొప్ప వ్యక్తి, ఇప్పుడు మనతో లేరు అనే భావన చిన్నప్పటి నుంచి నా మనసులో ముద్రపడిపోయింది. అందుకే నాన్న గారి విగ్రహాన్ని వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించేవరకూ చూడలేదు. ఎందుకంటే.. నాన్న గారు లేరనేది యాక్సప్ట్ చేయాలని. శిల్పి వినీత్ అద్భుతంగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. నాన్నగారు అద్భుతమైన జీవితాన్ని గడిపారు. మీ అందరికీ నాన్న గారు అద్భుతమైన నటుడు, తరతరాలు గుర్తుపెట్టుకునే పాత్రలు చేసిన నటుడు, కోట్లమంది తెలుగు ప్రజలు ప్రేమించిన వ్యక్తి. మాకు మాత్రం నాన్న గారు మా గుండెలను నాన్న ప్రేమతో నింపారు. చిరునవ్వుతో మమ్మల్ని పిలిచే వ్యక్తి. సంతోషాన్ని, బాధను నాన్నతోనే పంచుకునే వాళ్లం. ఆయనతో కూర్చుంటే అన్ని బాధలు తీరిపోయేవి. అన్నపూర్ణ స్టూడియోస్‌ అంటే ఆయనకు చాలా ఇష్టం. నచ్చిన స్థలంలో విగ్రహం పెడితే ప్రాణప్రతిష్ట చేసినట్లు అంటారు. ఆయన ప్రాణంతో మా మధ్యలోనే నడుస్తున్నారని అనుకుంటున్నాం. ఆయన మన అందరి మనసుల్లో జీవించే వుంటారు. మా కుటుంబానికి పెద్ద దిక్కు వెంకయ్య నాయుడు గారు. ఎప్పుడు ఆహ్వానించినా ఆయన తప్పకుండా వస్తారు. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.