Leading News Portal in Telugu

PM Modi: ప్రధాని మోడీ వాట్సాప్ ఛానెల్ రికార్డ్.. ఒక్క రోజులోనే మిలియన్ ఫాలోవర్లు


PM Modi: ప్రధాని నరేంద్రమోడీ క్రేజ్ మామూలుగా లేదు. సోషల్ మీడియా ఫ్లాట్‌పాం ఎక్స్(ట్విట్టర్), ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు స్థాయిలో మోడీకి ఫాలోవర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ బుధవారం తన వాట్సాప్ ఛానెల్ క్రియేట్ చేశారు. ఒక్క రోజులోని రికార్డు స్థాయిలో మిలియన్ సబ్‌స్క్రైబర్లను దాటింది.

ఇప్పటికే ఎక్స్(ట్విట్టర్)లో 91 మిలియన్ల మంది ఫాలోవర్లలో ప్రధాని మోడీ దేశంలోనే నెంబర్ 1గా ఉన్నారు. ఫేస్‌బుక్‌లో పీఎం మోడీకి 48 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 78 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

వాట్సాప్ ఛానెల్ ఫీచర్నిని ప్రవేపెట్టిన తర్వాత ప్రధాని మోదీ మంగళవారం వాట్సాప్ ఛానెల్ లో చేరారు. వాట్సాప్ కమ్యూనిటీలో చేరినందుకు థ్రిల్ గా ఉందని, కొత్త పార్లమెంట్ భవనం నునంచి ఒక ఫోటోను పోస్ట్ చేశారు. మెటా సెప్టెంబర్ 13 భారత్ తో పాటు 150కి పైగా దేశాల్లో వాట్సాప్ ఛానెల్ ప్రారంభించింది.