Leading News Portal in Telugu

Girlfriend Birth Day: యువకుడి ప్రాణాలు మీదికి తెచ్చిన గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే


Girlfriend Birth Day: గర్ల్ ఫ్రెండ్ పుట్టిన రోజు ఓ యువకుడికి చావు వరకు తీసుకెళ్లింది. ప్రియురాలి బంధువులు అతడిని చితక్కొట్టారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని ఛప్రాలో జరిగింది. ప్రస్తుతం యువకుడిని ఆస్పత్రికి తరలించిన వీడియో అక్కడ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియురాలి పుట్టిన రోజులు ఇంటికి వెళ్లి విషెస్ చెబుదామనుకుంటే, వారి కుటుంబ సభ్యులకు చిక్కాడు.

ప్రియురాలి పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలిపేందుకు యువకుడు ఆమె ఇంటికి అర్థరాత్రి వెళ్లాడు. సదరు యువతితో కేక్ కూడా కట్ చేయించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కేక్ కట్ చేయించడానికి గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన సమయంలో అమ్మాయి బంధువులకు ఈ విషయం తెలిసింది. దీంతో అతడిని పట్టుకుని దారణంగా కొట్టారు.

కొట్టడమే కాకుండా, అతడిని పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలైన యువకుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. నడవలేని స్థితిలో ఉన్న యువకుడిని వీల్ చైర్ సాయంతో ఆస్పత్రిలోకి తీసుకెళ్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని, విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు.

అంతకుముందు ఇలాగే తమిళనాడులో గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే ఓ యువకుడి హత్యకు కారణమైంది. అర్థరాత్రి సమయంలో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు యువతి ఇంటికి వెళ్లిన యువకుడిని కుటుంబ సభ్యులు హత్య చేశారు. ఆ సమయంలో యువకుడు మద్యం మత్తులో ఉన్నాడు. విచక్షణారహితంగా బంధువులు దాడి చేయడంతో యువకుడు మరణించాడు.