Singer Sreerama Chandra Papam Pasivadu Title Song Released: గత ఏడాది ‘పాపం పసివాడు’ పేరుతో ఓ సిరీస్ ను రూపొందిస్తున్నట్లు ‘ఆహా’ ప్రకటించగా అప్పుడే సిరీస్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఈ సిరీస్ లో ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్, నటుడు, ఇండియన్ ఐడల్ 5 విన్నర్ శ్రీరామ చంద్ర ప్రధాన పాత్ర పోషిస్తుండగా రాశీ సింగ్, గాయత్రి చాగంటి, శ్రీ విద్యా మహర్షి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫుల్ ఫన్ తో ముందుకు సాగే ఈ సిరీస్ సెప్టెంబర్ 29న ‘ఆహా’ ఓటీటీలోకి రాబోతోండగా ఆ మధ్య రిలీజ్ అయిన ఈ సిరీస్ టీజర్ మరింత ఇంట్రెస్ట్ పే నచ్చింది. ఇక తాజాగా ఈ ఆహా ‘పాపం పసివాడు’ ఒరిజినల్‌లోని పాటను రిలీజ్ చేశారు. ది వీకెండ్ షో నిర్మాణంలో ఈ సీరిస్ రూపొందగా మొత్తం 5 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రేమలో చిక్కుకున్న ఓ యువకుడి జీవితంలో ఎలాంటి గందరగోళం క్రియేట్ అయ్యింది అనే విషయాన్ని అందరూ ఎంజాయ్ చేసేలా తెరకెక్కించారు.
Akkineni Nageswara Rao: అతిరథ మహారథుల సమక్షంలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణ
పాపం పసివాడు సిరీస్ విషయానికి వస్తే ఇందులో పాతికేళ్ల కుర్రాడు మన హీరో క్రాంతి ప్రేమ కోసం హృదయమంతా బాధతో పరితపిస్తూ ఎదురు చూస్తుంటాడు. అయితే ఉన్నట్టుండి ఒకరు కాదు ఇద్దరు కాదు.. ముగ్గురు అమ్మాయిలు అతని జీవితంలోకి ప్రవేశిస్తారు, దీంతో అతని జీవితంలో ఊహించిన ఘటనలు జరుగుతాయి. లైఫ్ అనేక మలుపులు తిరుగుతుంది, ఈ రొమాంటిక్ జర్నీలోకి విషయాల చుట్టూ కథ నడుస్తున్నప్పుడు తెలియని గందరగోళం క్రియేట్ అవుతుంది దాన్ని ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తారని మేకర్స్ చెబుతున్నారు. ఈ సిరీస్‌కు అనుబంధంగా ఆహా ..‘పాపం పసివాడు’ అనే పాటను విడుదల చేసింది. సిరీస్‌లోని పాత్రలను తరచి చూస్తూనే భావోద్వేగ ప్రయాణాన్ని ఈ పాటలో ఆవిష్కరిచారు మేకర్స్.