
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి.. ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి అసెంబ్లీ సమావేశాలు .. కళ్యాణ మస్తు పథకం, విదేశీ విద్య, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రాతినిధ్యంపై ప్రశ్నలు.. వాటికి సమాధానాలు చెప్పనుంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. గ్రామ పంచాయితీలకు 15వ ఆర్ధిక సంఘం నిధులు, మంగళగిరి-తాడేపల్లి పురపాలక సంఘంలో రహదారుల విస్తరణ అంశాల పై ప్రశ్నలు వేయనున్నారు.. ఇక, ప్రశ్నోత్తరాల తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు.. సభను ఎన్ని రోజులు నిర్వహించాలి, అజెండా పై బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.. మరోవైపు.. ఉదయం పది గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి.. పెద్దల సభ కూడా ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకాబోతోంది.. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశం, పులివెందులలో భూ పంపిణి తదితర అంశాల పై ప్రశ్నలు వేసే అవకాశం ఉంది.. ఇక, తొలిరోజు అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్‌పై వాయిదా తీర్మానం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.. చంద్రబాబు అరెస్టుపై చర్చించాలని ఉభయ సభల్లో పట్టుపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
Read Also: TS TRT : ఉపాధ్యాయ నియామక పరీక్ష తేదీలను ప్రకటించిన విద్యా శాఖ..