Dead Policeman Comes alive While Taking To Postmortem in Punjab Ludhiana: పంజాబ్‌లోని లూథియానాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయాడుకున్న పోలీసు అధికారం పోస్టమార్టం కోసం తరలిస్తుండగా ఉన్నట్టుండి కదిలాడు. దీంతో వెంటనే అతడిని మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యుల వేరే ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం పంజాబ్ లోని లుధియానాకు చెందిన పోలీసు అధికారి మన్ ప్రీత్ ను విషపు పురుగులు కుట్టాయి. దీంతో శరీరంలో ఇన్ఫెక్షన్ పెరగడంతో వారి కుటుంబ సభ్యులు మన్ ప్రీత్ ను ఎయిమ్స్ బస్సీ ఆసుపత్రిలో చేర్పించారు.
ఆసుపత్రిలో చేర్పించగానే అక్కడి వైద్యులు మన్ ప్రీత్ చేతిపై ఏదో మందు రాశారు. దాంతో అతని చేయి బాగా మండిపోయింది. దీంతో మన్ ప్రీత్ రాత్రంతా మూలుగుతూనే ఉన్నాడని అతని తండ్రి ఏఎస్ఐ రామ్ జీ తెలిపారు. తరువాత ఆసుపత్రి సిబ్బంది తమ కొడుకు పరిస్థితి క్లిష్టంగా ఉందని చెప్పారని వెంటిలేటర్ పై ఉంచాలని సూచించారని వెల్లడించారు. తమకు తెలిసినంత వరకు తమ కొడుకును రెండు నుంచి మూడు రోజులు వెంటిలేటర్ పై ఉంచినట్లు పేర్కొన్నారు. అయితే వెంటిలేటర్ పై నుంచి తీస్తే తమ కొడుకు మరణిస్తాడని చెప్పారని, తరువాత వచ్చి తమ కొడుకు చనిపోయాడు తెల్లారి తొమ్మిది గంటల సమయంలో బాడీని అప్పగిస్తామని చెప్పినట్లు తెలిపారు. అయితే మన్ ప్రీత్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతడిని పోస్ట్ మార్టం కోసం కొంతమంది వేరే పోలీసుల సాయంతో తరలిస్తుండగా అతడిలో కదలికలు ఉండటాన్ని ఓ పోలీసు గుర్తించి చెప్పాడని వెంటనే అతడిని మరో ఆసుపత్రికి తరలిచ్చామని అక్కడ మన్ ప్రీత్ పరిస్థితి నిలకడగా ఉందని రామ్ జీ తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తన కొడుకు ప్రాణాలు పోయేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రామ్ జీ వ్యాఖ్యలను ఆసుపత్రి వర్గాలు ఖండించాయి. మన్ ప్రీత్ చనిపోయినట్లు తాము అసలు నిర్థారించలేదని, అలా అని తాము ఏ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదని పేర్కొ్న్నారు. తాము కానీ, ఆసుపత్రి సిబ్బంది ఎవరూ కానీ అలా చెప్పలేదని వైద్యులు చెబుతున్నారు. కేవలం మన్ ప్రీత్ పరిస్థితి విషయంగా ఉందని మాత్రమే తాము చెప్పామని అందుకే వేరే ఆసుపత్రికి తరలిస్తున్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్ కూడా ఇచ్చి పంపించామని ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టిపారేస్తున్నారు.