Leading News Portal in Telugu

Kolkata: అరుదైన ఘటన.. కడుపులో బిడ్డకు డెంగ్యూ


From Mother New Born Gets Dengue Due to Vertical transmission in Kolkata: కోల్‌కతాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ప్రెగ్నెన్సీ టైంలో తల్లికి డెంగ్యూ రావడంతో నవజాత శిశువుకు కూడా  NS1 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇలా తల్లి నుంచి బిడ్డకు వైరస్ సోకడం చాలా అరుదుగా జరుగుతుంది. దీనిని వర్టికల్ ట్రాన్స్ మిషన్ అంటారు. అంటే తల్లి నుంచి వచ్చే స్రవాలు (పాలు పట్టడం, ఇతర మార్గాలు) ద్వారా బిడ్డకు వైరస్‌, ఇన్‌ఫెక్షన్‌ సోకడం. ఇవి దోమలు లాంటి జీవుల్లో సాధారణం కానీ మనుషుల్లో చాలా అసాధారణమైన చర్య.

కోల్‌కతాలోని లేక్ టౌన్ లో ఉంటున్న యువతి గర్భవతిగా ఉన్నప్పుడు డెంగ్యూ సోకింది. దీంతో ఆమె చార్నాక్ హాస్పిటల్‌లో చేరింది. అప్పటికి ఆమె ప్లేట్ లెట్ల సంఖ్య 40,000లకు పడిపోయింది. ఆమె ఆసుపత్రితో చేరిన నాలుగో రోజున అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు ఆమెకు సీ-సెక్షన్ ద్వారా వైద్య పరీక్షలు చేశారు. ఆమెది RH-నెగటివ్ బ్లడ్ గ్రూప్‌ కావడంతో వైద్యులు ఆమెకు పలు రకాల పరీక్షలు చేయించారు. ఆమెకు డెంగ్యూ పాజిటివ్ రావడంతో అనుమానంతో వైద్యులు బిడ్డకు కూడా పలురకాల పరీక్షలు చేయించారు. దాంట్లో బిడ్డకు కూడా తల్లి నుంచి డెంగ్యూ సోకినట్లు నిర్థారణ అయ్యింది. దీంతో బిడ్డకు కొద్ది రోజుల పాటు ఐవీ థెరపీ చేశారు. దీంతో శిశువు కోలుకుంది. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. వారిని డిశార్జ్ కూడా చేసినట్లు వెల్లడించారు. శిశువు ఆరోగ్యంగా 2.7 కిలోల బరువు ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. గర్భంతో ఉన్న మహిళ అతి అరుదైన సందర్భాలలో మాత్రమే తల్లి ప్లాసెంటా నుంచి కడుపులోని పిండానికి ప్రసవానికి ముందు గానీ, ప్రసవ సమయంలో కాని, ప్రసవమైన వెంటనే కానీ సోకే అవకాశం ఉందని వైద్యుల తెలిపారు. ఈ కేసులో తల్లి మావి ద్వారా బిడ్డకు వైరస్ సోకి ఉండవచ్చని వైద్యుల  అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యంపై శ్రద్ద చూపడం చాలా ముఖ్యమని పేర్కొ్న్నారు.