Minister Roja: ఏపీ అసెంబ్లీ వేదికగా మీసాలు మెలేయడాలు.. తొడగొట్టే ఘటనలు చోటు చేసుకున్నాయి.. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. ఓవైపు నందమూరి బాలకృష్ణ రెచ్చగొట్టాడని వైసీపీ ఆరోపిస్తుంటే.. మరోవైపు.. మంత్రి అంబటి రాంబాబే నన్ను రెచ్చగొట్టాడు.. దానికి ప్రతిగా నేను స్పందించా.. నా వృత్తిని అవమానించే విధంగా వ్యవహరించారని బాలయ్య మండిపడుతున్నారు.. అయితే, బాలయ్య వ్యవహారంపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. పబ్లిసిటీ కోసమే టీడీపీ నేతల హడావిడి చేస్తున్నారని ఆరోపించిన ఆమె.. సభాపతిపై టీడీపీ నేతలు ఫైల్స్ విసిరేసి, బాటిల్స్ పగలగొట్టి నానా హంగామా సృష్టించారు. సభా మర్యాదను అగౌరవ పరిచేలా బాలకృష్ణ ప్రవర్తన ఉందని దుయ్యబట్టారు..
తన తండ్రి ఎన్టీఆర్‌కు అవమానం జరిగినప్పుడు బాలయ్య ఎందుకు స్పందించలేకపోయాడు.. ఇప్పుడు బావ కళ్లలో ఆనందం కోసమే బాలకృష్ణ మీసాలు మెలేస్తున్నాడు అంటూ విమర్శించారు రోజా… బాలకృష్ణ సభను సినిమా షూటింగ్ అనుకుంటున్నాడు.. చంద్రబాబు అవినీతి చేసి దొరికిపోయిన దొంగ. తొమ్మిదేళ్లలో ఎన్నిసార్లు బాలకృష్ణ సభకు వచ్చాడు.? అంటూ నిలదీశారు.. నేను బాలకృష్ణకు సూటికగా చెబుతున్నారు.. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం లాంటి సీఎం వైఎస్ జగన్ ముందు కాదంటూ ఆయన డైలాగ్‌ను ఆయనపైనే ప్రయోగించారు.. సూటిగా మరో ప్రశ్న వేస్తున్న.. శాసన సభకు ఎన్నిసార్లు హాజరయ్యారు.. మీ నియోజకవర్గం సమస్యలపై ఫైటింగ్ చేశారా? అని నిలదీశారు మంత్రి ఆర్కే రోజా..