Etela Rajender: ఏ రాజకీయ నాయకుడైనా హమీలు ఇచ్చాడంటే అమలు చేయాలి.. మోడీ పట్టు బడితే చేస్తాడు అనే దానికి నిదర్శనం మహిళ రిజర్వేషన్ బిల్లు అని ఈటల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయి. వాటిని ఎందుకు అమలు చేయలేదు మనసు లేకనా అని ప్రశ్నించారు. హామీలు ఇవ్వడం కాదు అమలు చేయడం ముఖ్యమన్నారు. ఎన్నికల ముందు 10 లక్షల డబల్ బెడ్ రూం లు ఇస్తానన్నాడు కేసీఆర్. వాటి జాడే లేదు. ఉద్యోగం లేని వారికి 3016రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఆరోపించాడు.
ఓట్ల అప్పుడు ఉండే ప్రకటనలు చేతల్లో ఎందుకు లేదో అడగాలని ప్రజలను కోరుతున్నట్లు చెప్పాడు. రైతులకు చేస్తానన్న రుణ మాఫీ చేయకపోవడంతో రైతులు గోస పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు లేక నే ఇవ్వన్నీ ఇవలేక పోతున్నారని ఈటల అన్నారు. అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్ కూడా హామీలు ఇస్తుంది… కాంగ్రెస్ నేతలే రాష్ట్రం దివాలా తీసింది అంటున్నారు. మరి మీరిచ్చే హామీలు డబ్బులు లేకున్నా అమలవుతాయా అని ప్రశ్నించారు. ప్రతి మహిళకు రూ.2,500, అర్హులకు నాలుగు వేల పింఛన్, ఒకే సారి రైతు రుణమాఫీ ఎలా చేస్తారో అర్థం కావడం లేదన్నారు. ఒకే సారి రుణమాఫీ చేయడం బ్రహ్మ దేవుడికి కూడా సాధ్యం కాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో గతంలో గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా అని క్వశ్చన్ చేశారు. ఆర్థిక మంత్రి గా పని చేసిన తనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై అవగాహన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ అండ దండలతో సాధ్యమయ్యే మంచి స్కీమ్ లను తెలంగాణ లో ప్రవేశ పెడతామన్నారు. దీనిపై అతి త్వరలోనే మేనిఫెస్టో ప్రకటిస్తామని తెలిపారు. తానే కనుక కుట్రలు చేసుంటే 22 ఏళ్లుగా ఎలా గెలుస్తానన్నారు. ఈటల రాజేందర్ శ్రమను, ధర్మాన్ని, ప్రజలను నమ్ముకున్నాడని చెప్పారు. కొన్ని పత్రికలు పని కట్టుకుని తనపై తప్పుడు వార్తలు రాస్తున్నాయని.. తాను ఎవరికీ శత్రువును కాదన్నారు. ఒకవేళ అలా ఎవరైనా భావిస్తే వారిష్టానికే వదిలేస్తున్నానన్నారు. ఇప్పటికే వంద సార్లు చెప్పిన.. ఏ పార్టీలో చేరేది లేదని స్పష్టం చేశారు.