Leading News Portal in Telugu

Surya Teja Aelay: టాలీవుడ్లో మరో వారసుడు ఎంట్రీ.. హీరోగా స్టార్ డిజైనర్ కొడుకు!


Surya Teja Aelay Bharathanatyam First Look Revealed: టాలీవుడ్ లో సినీ రంగానికి చెందిన వారి వారసుల ఎంట్రీ కామన్ గా జరిగేదే. ఇప్పుడు పాపులర్ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే తనయుడు సూర్య తేజ ఏలే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాను ‘దొరసాని’ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కెవిఆర్ మహేంద్ర దారిరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న సూర్య తేజ హీరోగా నటించడమే కాకుండా, దర్శకుడు కెవిఆర్ మహేంద్రతో కలిసి కథ, స్క్రీన్‌ప్లే & డైలాగ్స్ కూడా రాశారు. పీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పాయల్ సరాఫ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి గోస్వామి హీరోయిన్. మేకర్స్ ఈరోజు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేసారు. ఈ సినిమాకి ‘భరతనాట్యం’ అనే క్లాసిక్ టైటిల్‌ని లాక్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. క్రైమ్ కామెడీగా రూపొందిన ఈ ‘భరతనాట్యం’ సినిమాకి ‘సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్’ అనే క్యాప్షన్ పెట్టడం గమనార్హం.

Suhas Cable Reddy: నవ్వులతో గుండెకి కనెక్షన్ ఇచ్చేస్తాడు ఈ కేబుల్ రెడ్డి

ఇక ఈ సినిమా టైటిల్‌పై బ్లడ్ మార్క్స్ కనిపిస్తుండగా సూర్య తేజ షేడ్స్‌తో ట్రెండీ, స్టైలిష్‌గా ఉండగా అతనికి పూలతీగ చుట్టుకోవడం ఆసక్తికరంగా ఉంది. ఇక వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, టెంపర్ వంశీ కూడా పోస్టర్ లో కనిపించారు. చాలా మంది ప్రముఖ హాస్యనటులు నటిస్తున్న ఈ సినిమా హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ట్యాగ్‌లైన్ సూచించినట్లుగా భరతనాట్యానికి సినిమా కనెక్షన్ ఉన్నట్టు కనిపిస్తూ ఉండగా పోస్టర్‌లోని తుపాకీ సినిమా క్రైమ్ సైడ్‌ను సూచిస్తోంది. ఈ సినిమాకు ‘భరతనాట్యం’ అనే క్లాసిక్ టైటిల్ ఎందుకు పెట్టారో తెలియాలంటే టీజర్ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు మేకర్స్. ‘భరతనాట్యం’ షూటింగ్ మొత్తం పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.