Leading News Portal in Telugu

Mahalakshmi: డబ్బుకోసం పెళ్లి చేసుకొని.. భర్తను జైలుకు పంపి.. ఇలా చేయటానికి సిగ్గులేదు..?


Mahalakshmi: కోలీవుడ్ నటి మహాలక్ష్మీ పేరు వినే ఉంటారు. నిర్మాత రవీంద్రన్ చంద్రశేఖరన్‌ ను వివాహమాడి ఆమె బాగా ఫేమస్ అయ్యింది. లావుగా ఉన్న రవీంద్రన్ ను ఆమె ప్రేమించి పెళ్లిచేసుకోవడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమె ప్రేమతో పెళ్లి చేసుకుందని చెప్పగా .. చాలామంది మాత్రం డబ్బుకోసమే ఆమె రవీంద్రన్ ను వివాహమాడింది అని విమర్శలు గుప్పించారు. ఇక ఇవన్నీ పట్టించుకోని ఈ జంట.. తమ జీవితంలో కొత్త రంగులు వచ్చినట్లు వెకేషన్స్ అని.. గిఫ్ట్ లు అని ఇచ్చిపుచ్చుకున్నారు. అయితే వీరి బంధానికి ఏ దిష్టి తగిలిందో ఏమో.. కొన్ని రోజుల క్రితమే రవీందర్ జైలు పాలు అయ్యాడు. ఒక చీటింగ్ కేసులో రవీంద్రన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యర్దాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్‌తో కోట్లు సంపాదించాడంటూ.. చెన్నెలోని ఒక వ్యక్తి రవీందర్ పై కేసు పెట్టాడు. ఆ కేసు విషయంలో రవీంద్రన్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇక మహాలక్ష్మీ వచ్చాకే ఇలా జరిగిందని కొందరు చెప్పుకొస్తున్నారు.

Leo: డెవిల్ తో లియో పోరాటం.. విజయ్ నట విశ్వరూపం

ఇకఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా మహాలక్ష్మీ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం ఆమెపై మరింత విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి. ఫొటోల్లో ఎటువంటి అశ్లీలత లేదు కానీ.. ఆమె ఫోటోలను షేర్ చేయడమే తప్పు అని చెప్పుకొస్తున్నారు. చీరకట్టులో మహాలక్ష్మీ హాట్ గానే కనిపిస్తుంది. అంతేకాకుండా నవ్వులు చిందిస్తూ కూడా కనిపించడంతో నెటిజన్స్ అనుమానాలకు దారితీసింది. భర్త జైల్లో ఉంటే .. ఏ భార్య.. ఇలా అలంకరించుకొని నవ్వుతు .. హాట్ గా ఫోటోలకు పోజులిస్తుంది. అందరు అంటున్నట్లే.. మహాలక్ష్మీ.. రవీంద్రన్ ను డబ్బుకోసమే పెళ్లి చేసుకొని ఉంటుంది. కొంపతీసి ఈమె భర్తను జైలుకు పంపిందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుకోసం పెళ్లి చేసుకొని.. భర్తను జైలుకు పంపి.. ఇలా ఫోటోలు దిగి పోస్ట్ చేయటానికి సిగ్గులేదు..? అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.