Wipro: భారత ఐటీ దిగ్గజం విప్రోలో కీలక ఉద్యోగి రాజీనామా చేశారు. రెండు దశాబ్ధాలుగా సంస్థలో పనిచేస్తున్న ఫైనాన్సియల్ చీఫ్ ఆఫీసర్ జతిన్ దలాల్ రాజీనామా చేసినట్లు గురువారం తెలిపింది. కంపెనీలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న అపర్ణా అయ్యర్, దలాల్ స్థానంలో సెప్టెంబర్ 22 నుంచి నియమితులవుతారని విప్రో రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది. ఇతర అవకాశాల కోసం జతిన్ దలాల్ రాజీనామా చేసినట్లు విప్రో తెలిపింది.
గత కొన్ని ఏళ్లుగా మా ఫైనాన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో అపర్ణ అంతర్భాగంగా ఉంది. మా ఆర్థిక వ్యూహాలు, ప్రణాళిక, పెట్టుబడి కార్యక్రమాలు, ట్రాన్స్‌ఫర్మేషన్ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తుందని విప్రో సీఈఓ థియరీ డెలాపోర్టే ఒక ప్రకటనలో తెలిపారు. దలాల్ 2002లో విప్రోలో చేరారు, ఆ తరువాత 2015లో ప్రెసిడెంట్, సీఎఫ్ఓ అయ్యారు. నవంబర్ 30న కంపెనీ నుంచి వెళ్లిపోనున్నారు.