Neha Shetty: ప్రస్తుతం గత కొన్ని రోజులుగా నేహాశెట్టి పేరు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది నేహా శెట్టి. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా అమ్మడికి మాత్రం వరుస అవకాశాలను అందించింది. అయితే నేహశెట్టి కెరీర్ ను మార్చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది డీజే టిల్లు అని చెప్పాలి. రాధిక పాత్రలో నేహా అదరగోట్టేసింది.ఈ చిత్రంతో ఒక్కసారిగా నేహా శెట్టి స్టార్డమ్ ను అందుకుంది. ఇక ఈ మధ్యనే బెదురులంక 2012 చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలోని చుట్టంలా చూసి పోకలా అనే సాంగ్ తో.. రూల్స్ రంజన్ చిత్రంలోని సమ్మోహనుడా సాంగ్ తో మరింత ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షూటింగ్ జరుగుతుండగా.. రూల్స్ రంజన్ రిలీజ్ కు సిద్ధమైంది. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం కొడుకే ఈ జ్యోతి కృష్ణ. దీంతో ఈ సినిమాపై అభిమానులే కాకుండా పవన్ ఫ్యాన్స్ సైతం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Tiger Nageswara Rao: ఆ లిరిక్స్.. మాస్ మహారాజా కటౌట్.. పర్ఫెక్ట్ సింక్ రా
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జ్యోతి కృష్ణ హీరోయిన్ నేహా శెట్టితో గొడవ పడినట్లు తెలపడం హాట్ టాపిక్ గా మారింది.” సమ్మోహనుడా సాంగ్ షూట్ తరువాత నేహశెట్టి, నేను మూడు నెలలు మాట్లాడుకోలేదు. ఆ సాంగ్ షూట్ మొత్తం పూర్తీ అయ్యింది. చివరగా స్విమ్మింగ్ ఫూల్ లో ఒక షాట్ తీయాలి. అది తీసేస్తే సినిమా పూర్తవుతుంది. ఆ వాటర్ చూస్తే.. 5 డిగ్రీస్ టెంపరేచర్ ఉండొచ్చు. ఆమెను అడిగితే ఖచ్చితంగా చేయను అని చెప్పేస్తోంది. దీంతో నేను రివర్స్ లో నువ్వు చేయొద్దు అని చెప్పాను. కానీ, షాట్ పెట్టుకొని ఉన్నాను.. నాకు తెలుసు.. చెయ్ అంటే .. రేపు ఏదైనా ప్రాబ్లెమ్ అయితే నువ్వే చేయమన్నావ్ అంటుంది. అందుకే అలా మాట్లాడా.. ఆమె చేయకూడదు అని నాకు ఉంది.. అలా చేయకూడదు కూడా .. కాకపోతే చివరి షాట్.. ఉండాలి అని అలా చేయాల్సి వచ్చింది.
NTR: మాస్.. టెర్రిఫిక్.. ఇలాంటి పదాలు సరిపోవేమో.. దేవరకు దండం పెట్టడమే
ఇక నేహా వెళ్తాను.. చేస్తాను అని చెప్పడంతో వెళ్ళింది.. చాలాసేపు అందులో ఉండడంతో .. పూల్ లో అంతా క్లోరిన్ వాటర్ కావడంతో ఆమె మోకాళ్ళు కొద్దిగా గాయాలు అయ్యాయి. అప్పటికే అరగంటపైన అయ్యింది.. నాకేమో ఇంకా రెండు మూడు షాట్స్ తీయాల్సి ఉంది.. త్వరగా తీయ్.. త్వరగా తీయ్ అని అరుస్తుంది.. ఒక ఐదు నిముషాలు ఓర్చుకో అని చెప్పాను .. కానీ తను బయటికి వచ్చేసింది.బయటకు వచ్చాక ఆమెతో గొడవ అయ్యింది.. కొద్దిసేపు ఉంటే.. రెండు షాట్స్ ఎక్కువ తీసుకొనేవాడిని అని నేను గొడవపడ్డాను.. అప్పటినుంచి మూడు నెలలు వరకు ఆమెతో మాట్లాడలేదు. ఆ తరువాత ఎడిటింగ్ చేసేటప్పుడు.. ఆ వాటర్ షాట్ చూసి.. అర్రే ఎవరు కూడా ఇలాంటి షాట్ తీయలేరు.. అని ఫీల్ అయ్యి.. ఆమెకు కాల్ చేసి.. నేహాతో మాట్లాడాను” అని చెప్పుకొచ్చాడు. ఇక నేహా సైతం ఆ షాట్ తరువాత తాను ఏడ్చాను అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులు.. మా రాధికను అంత టార్చర్ పెట్టారా.. ? అని కొందరు.. ఏ హీరోయిన్ కు అయినా ఇలాంటి బాధలు తప్పవులే .. సాంగ్ బావుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో నేహా మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.
సమ్మోహనుడ సాంగ్ షూటింగ్లో గొడవ వల్ల హీరోయిన్ తో మూడు నెలలు మాట్లాడలేదు..!! – Director Rathinam Krishna#RathinamKrishna #RulesRanjann #Sammohanuda #NehaShetty #KiranAbbavaram #NTVENT #NTVTelugu pic.twitter.com/RP93tHP5LC
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) September 21, 2023