ఫ్రెంచ్ ఫ్రైస్.. క్రంచిగా, క్రీస్పిగా, అంతకు మించి టేస్టీగా ఉంటాయి..అందుకే వీటిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు..అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం ప్రాణాలకు ప్రమాదం అంటూ తాజా సర్వలో తేలింది.. ఎక్కువగా తీసుకుంటే ప్రాణంతకరమైన వ్యాదులు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు.. అసలు వీటిని తీసుకుంటే ఎటువంటి సమస్యలు తలేత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
జర్నల్ అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో 8 సంవత్సరాల అధ్యయనం తరువాత వేయించిన బంగాళదుంపలను క్రమంగా తీసుకోవడం వలన మరణానికి ఎక్కువ ప్రమాదం ఉందని కనుగొన్నారు. వీటిలో ఉండే కొవ్వు మరియు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఆహారాలు సంకలితం కావచ్చు..బరువు పెరగటం మాత్రమే ఆరోగ్యానికి హాని కలిగించదు. ఇలాంటి డీప్ ఫ్రైడ్ పొటాటోస్ తినడం వలన కూడా ఆరోగ్యానికి ప్రమాదమే. బంగాళదుంపలను 120 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ వేడి చేసినప్పుడు ఏర్పడే రసాయనం మైక్రిలామైడ్.. ఇది శరీరంలో పేరుకు పోతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు..
అందుకే ఎంత వీలైతే అంతగా ఫ్రెంచ్ ఫ్రైస్ ని నివారించడం మంచిది. ఎందుకంటే వాటిలోఎలాంటి పోషక విలువలు లేవు. అలాగే ఇవి ఎప్పుడో వండినవి ఇందులో ప్రెజర్వేటివ్స్ కలపటం తర్వాత అనారోగ్యకరమైన సోడియంని కూడా కలిగి ఉంటాయి.. ఇక వాటిని చెయ్యడంలో శుభ్రత అస్సలు ఉండదు.. అందుకే ఉడకపెట్టి తీసుకోవడం చాలా మంచిది.. అది కూడా లిమిట్ గానే తీసుకోవాలి.. ఎందుకంటే వీటిలో పిండిపదార్థం ఎక్కువగా ఉంటుంది.. శరీరానికి అంత మంచిది కాదు.. ఒకవేళ ఫ్రెంచ్ ఫ్రైస్ ని తినాలని అనుకుంటే మాత్రం ఎంచక్కా ఇంట్లోనే తయారు చేసుకొని తీసుకోవడం మంచిది..