World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ వచ్చే నెలలో స్వదేశంలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే అందుకోసం ఐసీసీ ప్రపంచకప్ ప్రైజ్ మనీని ప్రకటించింది. ప్రపంచకప్ గెలిచిన జట్టుకు 4 మిలియన్ US డాలర్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. రన్నరప్ జట్టుకు 2 మిలియన్ అమెరికన్ డాలర్లు ఇవ్వనుంది. ఇండియా కరెన్సీలో ప్రపంచ కప్ ఛాంపియన్ జట్టుకు సుమారు రూ. 33 కోట్ల 17 లక్షలు రానున్నాయి. రన్నర్ కు దాదాపు రూ.16 కోట్ల 58 లక్షల ప్రైజ్ మనీ వస్తుంది. అంతేకాకుండా.. ప్రపంచ కప్‌లో గ్రూప్ మ్యాచ్ గెలిస్తే కూడా 40 వేల డాలర్లు ఇవ్వనుంది ఐసీసీ. గ్రూప్ దశ తర్వాత ఎలిమినేట్ అయిన జట్టుకు 1 లక్ష డాలర్లు అందనుంది.
ప్రపంచ కప్ 2023లో సెమీ ఫైనల్‌కు చేరిన జట్టుకు 8 లక్షల డాలర్లు ఇవ్వనుంది. ఇలా దాదాపు అన్ని జట్లపైనా కాసుల వర్షం కురువనుంది. 2023 ప్రపంచకప్‌లో భారత్‌తో సహా మొత్తం 10 జట్లు ఆడనున్నాయి. ఈ టోర్నీ తొలి మ్యాచ్ అక్టోబర్ 5న జరగనుంది. అక్టోబర్ 8న చెన్నైలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 11న టీమిండియా ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. ఇదిలా ఉంటే.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అక్టోబర్ 14న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.