Leading News Portal in Telugu

Financier Locked House : అప్పు తీర్చలేదని కుటుంబ సభ్యులని ఇంట్లోఉంచి తాళం వేసిన ఫైనాన్సర్


అప్పు చేయడం మరియు తీర్చడం మానవ సహజం. కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల అప్పు తీర్చిడం ఆలస్యం కావచ్చు. లేదా అప్పు తీసుకున్న వ్యక్తి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టొచ్చు. ఏదేమైన ఇచ్చిన డబ్బులు వెనక్కి రాకపోతే న్యాయస్థానాన్ని సంప్రదించాలి. చట్టపరంగా ముందుకు వెళ్లి డబ్బులని రాబట్టుకోవాలి. అలా కాకుండా న్యాయాన్ని చేతిలోకి తీసుకోవడం చట్టపరంగా నేరం. అలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తన దగ్గర అవసరానికి అప్పు చేసిన వ్యక్తిని కుటుంబంతో సహా ఇంట్లో పెట్టి తాళం వేసాడు ఓ ఫైనాన్సర్. ఈ ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది.

Read also:Justin Trudeau: 50 ఏళ్లలో అత్యంత చెత్త కెనడా ప్రధాని ట్రూడో.. ప్రజామద్దతు ప్రతిపక్ష నేతకే..

వివరాలలోకి వెళ్తే విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని సీతారాంపురం అనే ఊర్లో ఉప్పల శ్రీనివాసరావు తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. కాగా అవసర నిమిత్తం అతను అంబల్ల కృష్ణ అనే ఫైనాన్సర్ వద్ద 2 లక్షల 80 వేలు రూపాయలు అప్పు తీసుకున్నారు. కాగా 3 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా శ్రీనివాసరావు అప్పు తీర్చలేదు. ఈ నేపథ్యంలో కృష్ణ తెల్లవారు జామున 5 గంటల 30 నిమిషాలకు శ్రీనివాసరావుని తన కుటుంబంతో సహా ఇంట్లో పెట్టి తాళం వేసాడు. కాగా ఈ విషయం మీడియాకి మరియు హ్యూమన్ రైట్స్ అధికారులకి తెలిసింది. అధికారులు మరియు మీడియా శ్రీనివాస రావు ఇంటికి వస్తున్నారు అని తెలుసుకున్న కృష్ణ తాళం తీసి వెళ్ళిపోయాడు. అనంతరం మీడియా తో శ్రీనివాసరావు మాట్లాడుతూ తన సమస్యని మీడియాతో పంచుకున్నారు.

Read also:Minister KTR: కేటీఆర్‌ తో కడియం, రాజయ్య.. వారిద్దరూ కలిసిపోయారా..!

మీడియా తో మాట్లాడిన శ్రీనివాసరావు.. తనకి ఊర్లో బయట కలిపి 30 నుండి 40 లక్షల అప్పుందని. గత రెండు సంవత్సరాలగా తన పరిస్థితి బాలేదని.. తాను అప్పు తీసుకున్న వాళ్ళకి ఎంత సొమ్ము అప్పుగా ఇచ్చారో అంత సొమ్ము వడ్డీగానే కాట్టానని అయితే అసలు మాత్రం అలానే ఉంటుందని.. అంబల్ల కృష్ణ దగ్గర 2 లక్షల 80 వేలు తీసుకున్నానని.. అందులో 80 వేలు చెల్లించానని.. ఇక 2 లక్షలు చెల్లించాలని చెప్పారు శ్రీనివాస రావు.. అప్పు తీసుకున్న డబ్బులు ఎగ్గొట్టాలనే ఆలోచన లేదని కానీ కృష్ణకి ఈ విషయం చెప్పిన వినకుండా ఇలా ఇంట్లో ఉంచి తాళం వేశారని.. ఇలా చేయడం ఇది రెండో సారని పేర్కొన్నారు. ఈ ఘటన పైన స్పందించిన హ్యూమన్ రైట్స్ అధికారి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పు తీసుకోవడం తీర్చడం మానవ సహాజం అని తెలిపిన హ్యూమన్ రైట్స్ అధికారి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం చట్టవిరుధం అని పేర్కొన్నారు. ఇలా అప్పు తీర్చలేదని ఇంట్లో పెట్టి తాళం వేయడం నేరమని పేర్కొన అయన ఈ ఘటన పైన కంప్లైన్ట్ తీసుకుంటాం. దీని వెనుక ఎవరున్నా శిక్షిస్తాం. తప్పు ఎవరు చేసిన చట్టం తన పని తాను చేసుకుపోతుందని శ్రీనివాస రావు కుటుంబానికి హ్యూమన్ రైట్స్ బృందం అండగా ఉంటుందని తెలిపారు.