Telangana Congress: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య భారీగానే ఉంది. ఇటీవల హైదరాబాద్ తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభ అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సోనియాగాంధీ ఆరు హామీ పథకాలను ప్రకటించి, ఒకవైపు ఆ పథకాలను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు కాంగ్రెస్‌లో చేరేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. ఆరు హామీ పథకాలు ప్రకటించడంతో కాంగ్రెస్ పై నేతల కన్ను పడింది. కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అధికార పార్టీలో నిరుత్సాహం.. కాంగ్రెస్ పార్టీలో ప్రోత్సాహం లభించడంతో ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే సమక్షంలో భారీ చేరికలు జరగనున్నాయి. కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నవారిలో మైనం పల్లి.. ఆయన కుమారుడు రోహిత్, రేఖా శ్యామ్ నాయక్, నకిరేకల్ వేముల వీరేశం, కుంభం అనిల్ (భువనగిరి), అరేపల్లి మోహన్ (మానకొండూర్) ఉన్నారు. దీంతో ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి
బీఆర్ఎస్‌కు మైనంపల్లి రిజైన్..
నేడు కాంగ్రెస్ లో కండువా కప్పుకునేందుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో జైపూర్ నుండి ఢిల్లీకి మైనంపల్లి పయనమయ్యారు. రాహుల్ గాంధీ, ఖార్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. అయితే.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నిన్న బీఆర్ఎస్ కు రిజైన్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మైనంపల్లి తనతో పాటు తన కొడుకు రోహిత్‌కు మెదక్ నుంచి టికెట్ ఇవ్వాలని అడిగాడు. అయితే సీఎం కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్ధుల జాబితాలో మల్కాజిగిరి నుంచి హనుమంతరావుకు టికెట్ కేటాయించగా.. రోహిత్‌కు మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ పరిణామాలతో రగిలిపోయిన మైనంపల్లి హనుమంతరావు.. తన కొడుక్కి టికెట్ రాకుండా మంత్రి హరీశ్ రావు చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిని బీఆర్ఎస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తుందని.. మైనంపల్లి స్థానంలో మల్కాజిగిరిలో మరొకరికి అవకాశం ఇస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అలాంటివేవి జరుగలేదు.. మల్కాజిగిరిలో మైనంపల్లి, మెదక్‌లో రోహిత్ పర్యటిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ కు మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేసిన నేపథ్యంలో మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి టికెట్ మర్రి రాజశేఖర్ రెడ్డికి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నేడో రేపు మర్రి రాజశేఖర్ రెడ్డి పేరును బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. రాజశేఖర్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి అల్లుడు.. గత లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయాడు.
కాంగ్రెస్ పార్టీలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం..
ఇక మరోవైపు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలు కారణాలతో కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఆయన చేరిక తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగా శనివారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి ఆహ్వానం అందడంతో వీరేశం శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. అయితే.. కొద్ది రోజులుగా వీరేశం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 17న సీడబ్ల్యూసీ సమావేశాలతో పాటు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించగా, జాతీయ నేతల బిజీ కారణంగా ఆ రోజు కాంగ్రెస్‌లో చేరలేకపోయారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, వేముల వీరేశం ఢిల్లీకి రావాలని సూచించారు. దీంతో ఆయన శనివారం ఢిల్లీలో అందుబాటులో ఉండే జాతీయ నేతల సమక్షంలో పార్టీలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వేముల వీరేశం సన్నాహాలు చేసుకుంటూ కొద్ది రోజులుగా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు ఏఐసీసీ కార్యాలయం నుంచి ఆహ్వానం అందడంతో ఢిల్లీ వెళ్లారు.
Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వార్నింగ్