Vizag Crime: విశాఖపట్నంలో ఓ బాలిడి హత్య కలకలం సృష్టిస్తోంది.. విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల బాలుడిని దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. బాలుడు గొంతు కోసి.. గోనె సంచిలో చుట్టి.. ఫిషింగ్ హార్బర్ సముద్రంలోకి విసిరేసి పరారయ్యారు.. మృతుడు భజన కోవెల గొల్ల వీధిలో ఉంటున్న చిన్న అలియాస్ చిన్న విస్కీగా గుర్తించారు పోలీసులు.. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వన్ టౌన్ పోలీసులు.. అసలు బాలుడిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది..? హత్య వెనుక ఎవరున్నారు..? కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసుల విచారణ చేపట్టారు పోలీసులు. కాగా, విశాఖలో వరుసగా ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. కిడ్నాప్‌లు, హత్యలు జరగడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విశాఖపట్నం వాసులు.