Vishal Broke down while talking about meera antony Suicide: హీరో విశాల్ ఈ మధ్యనే మార్క్ ఆంటోని సినిమాతో హిట్ అందుకుని ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం కాస్త మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా బాగానే వర్కౌట్ అయింది. ఈ క్రమంలోనే రిలీజ్ తర్వాత కూడా విశాల్ వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తూ మార్క్ ఆంటోని సినిమాను ఇంకా జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే తమిళ చిత్ర పరిశ్రమలో జరిగిన విషాదకర సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రముఖ హీరో విజయ్ ఆంటోని కుమార్తె మీరా తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశము అయింది. స్కూల్ లో చదువుల ఒత్తిడి, డిప్రెషన్ కారణం అంటూ చెబుతున్నప్పటికీ ఆమె మృతి గురించి సరైన కారణాలు ఏమిటి అనేది ఎవరికీ తెలియదు.
Malaika Arora: ఖతర్నాక్ పోజులతో కిర్రాక్ పుట్టిస్తున్న మలైకా అరోరా
ఇక తాజాగా చెన్నైలో నిర్వహించిన మార్క్ ఆంటోని మూవీ సక్సెస్ మీట్ లో విశాల్ మీరా మృతిపై స్పందిస్తూ ఎమోషనల్ అయిపోయాడు. ఆమె మృతి విషయంలో ఒక నిమిషం పాటు మౌనం పాటించి ఆ తర్వాత విజయ్ ఆంటోని తన కాలేజ్ మేట్ అని గుర్తు చేసుకున్న విశాల్.. మీరా మృతి గుర్తు చేసుకుని కెమెరాలు అన్నీ ఉండగానే ఏడ్చేశారు. మీరా ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకున్న విశాల్ విజయ్ కి జరిగిన ఈ నష్టం నాకు జరిగినట్లు అనిపిస్తోందని అన్నారు. వెంటనే కంట్రోల్ చేసుకుని తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇక మరో పక్క విజయ్ ఆంటోనీ కూడా తన కుమార్తె మరణం గురించి ఎమోషనల్ అవుతూ ఒక లెటర్ షేర్ చేశారు.