Leading News Portal in Telugu

Bigg Boss 7 Leaks: ఈ వారం అందరూ అనుకున్న కంటెస్టెంట్ అవుట్.. ఎవరో తెలుసా?


Singer Damini Eliminated from Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్ తెలుగు సీజన్ 7లో రెండు వారాలు పూర్తి కాగా చివరికి మూడో వారం చివరికి ఎంట్రీ ఇచ్చింది. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా ఎలిమినేట్ అయ్యారు. వీకెండ్‌లో షో అంటే నాగార్జున వస్తున్నాడు అంటే ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవడం ఖాయమే అన్నమాట. ఇక మూడో వారం ఎలిమినేషన్ జాబితాలో ఏడుగురు ఉన్నారు. సింగర్ ధామిని, అమర్ దీప్, ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, శుభశ్రీ ఈ నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో కంటెంట్, ఫాలోయింగ్, ఎక్స్ ట్రా కల్చరల్ యాక్టివిటీస్ పరంగా చూసుకుంటే ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎవరికి తక్కువ ఓట్లు పడతాయి అనే విషయాలను పక్కన పెడితే ప్రతి వారం లానే ఈ వారం కూడా లీక్స్ బయటకు వచ్చాయి.

Jr NTR Look: అదిరిపోయే లుక్‌లో జూనియర్‌ ఎన్టీఆర్.. ఏమున్నాడ్రా బాబూ!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లీక్స్ ప్రకారం లేడీ కంటెస్టెంట్ అయిన దామిని ఇంటి దారి పట్టినున్నట్లు తెలుస్తోంది. అందుకు బలమైన కారణమే ఉందని అంటున్నారు. హౌస్‌లోని కొందరిపై ఆమె హాట్ కామెంట్స్ చేయడంతో ఆ కామెంట్స్‌తోనే చిక్కులో పడ్డట్లు అంటున్నారు. ఓటింగ్ శాతం కూడా ఈ విషయం వల్ల భారీగా డ్రాప్ అయిందని అంటున్నారు. ఈ వీక్ లో గేమ్, టాస్కులు, ఓట్లు పరంగా చూసుకుంటే ఇప్పటికే అమర్ దీప్, ప్రియాంక జైన్ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోగా శోభాశెట్టి, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్ జనాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. హౌస్ లోని కొందరు టార్గెట్ చేయడంతో యావర్ కి సింపతీ పెరిగినట్టు చెబుతున్నారు.