Crime News: విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఓ బాలుడు దారుణహత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి దుండగులు సముద్రంలో పడేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మైనర్ బాలుడి హత్య కేసును పోలీసుల ఛేదించారు.
చిన్న అలియాస్ విస్కీ(17)ని బటన్ నైఫ్‌తో నలుగురు యువకులు గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సిగరెట్ కోసం గొడవపడి అసభ్య పదజాలంతో దూషించినందుకు కోపంతో నలుగురు యువకులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య చేసిన అనంతరం దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని ఓ గోనెసంచిలో చుట్టి ఫిషింగ్ హార్బర్లోని 11 వ నెంబర్ జెట్టిలో పడేసి ఆ యువకులు పరారైనట్లు తెలిపారు. పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టగా.. నలుగురు యువకులు పట్టుబడ్డారు. అనంతరం నిందితులను జువైనల్ హోంకు తరలించారు.