పోస్టాఫీస్ తమ కస్టమర్స్ కోసం ఎన్నో రకాల స్కీమ్ అందిస్తుంది.. కొత్తగా పొదుపు చెయ్యాలనుకొనేవారికి ఇది మంచిది బెనిఫిట్స్ ఇస్తుంది.. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అందిస్తోంది..ఈ స్కీమ్ గురించి వివరంగా తెలుసుకుందాం..
ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు..అయితే ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఒక విషయం గుర్తించుకోవాలి. ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉటుంది. ఈ డబ్బుపై మీరు ప్రతి నెలా వడ్డీ రూపంలో రాబడి పొందొచ్చు. మెచ్యూరిటీ తర్వాత మీ డబ్బులుకు మీకు వస్తాయి.. ఈ స్కీమ్ వల్ల మీరు రూ.9 లక్షల వరకు దాచుకోవచ్చు.. అలాగే మీరు జాయింట్ అకౌంట్ తీసుకుంటే మాత్రం మీరు.. రూ.15 లక్షలు ఆదా చేసుకోవచ్చు.. గతంలో గరిష్టంగా రూ. 9 లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఈ లిమిట్ చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు..
స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.4 శాతం మేర వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి తగ్గొచ్చు. లేదంటే పెరగొచ్చు. లేదంటే స్థిరంగా కూడా ఉండొచ్చు. ఉదాహరణకు మీరు ఈ పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో రూ. 15 లక్షలు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ఇప్పుడు మీకు చేతికి ప్రతి నెలా రూ. 9,250 వరకు వస్తాయి.. అదే మీరు రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. మీకు ప్రతి నెలా రూ. 3 వేలు పొందవచ్చు.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు..