Ram Pothineni interesting Comments on Virat Kohli Biopic: ఉస్తాద్ రామ్ పోతినేనికి తెలుగులో మాత్రమే కాదు, హిందీలోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన సినిమాలు డబ్బింగ్ చేయగా మిలియన్ & మిలియన్స్ వ్యూస్ కూడా వస్తున్నాయి. తెలుగులో తన పాత్రలకు రామ్ స్వయంగా డబ్బింగ్ చెబుతారు కానీ, హిందీలో? ఆయనకు సంకేత్ మాత్రే డబ్బింగ్ చెబుతున్నారు. హిందీలో డబ్బింగ్ అయ్యే హాలీవుడ్ హీరోలకు కూడా డబ్బింగ్ చెప్పే ఆయన రామ్ పోతినేనిని ఇంటర్వ్యూ చేశారు. సంకేత్ మీరు ఇటీవల షారుఖ్ ఖాన్ గారిని కలిశారని విన్నా అని అడిగి ‘జవాన్’ చూడాలని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు ‘స్కంద’ ట్రైలర్ చూశారు, షారుఖ్ ని కలిసినప్పుడు ఎలా అనిపించింది? అని అడిగారు. దానికి రామ్ మాట్లాడుతూ ఆయనను కలిసిన మరుక్షణం నుంచి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారని, నాకు అట్లీ, ప్రియా మంచి ఫ్రెండ్స్ అని అన్నారు.
Bigg Boss 7 Telugu: సీరియల్ బ్యాచ్ ను కడిగిపడేసిన నాగ్ .. సందీప్ కు భారీ షాక్..
షారుఖ్ గారికి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అని పేర్కొన్న రామ్ నా సినిమాల గురించి మాట్లాడారని అన్నారు. మీరు ఓ ఇండియన్ క్రికెటర్లా ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తుంటాయి కదా ఎప్పుడైనా చూశారా? అని అడిగితే రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం లుక్ డిసైడ్ చేశాక సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని అప్పటి నుంచి ఈ కంపేరిజన్ ఎక్కువ వస్తోందని అన్నారు. విరాట్ కోహ్లీలా ఉన్నారని చాలా మంది అంటుంటారు, ఒకవేళ ఆయన బయోపిక్ చేసే అవకాశం వస్తే? రామ్ తప్పకుండా చేస్తా, విరాట్ బయోపిక్ అంటే ఎగ్జైటింగ్ కదా అని అన్నారు. మీ సినిమాలకు హిందీలో వస్తున్న వ్యూస్ చూసి ఏమనిపిస్తుంది? అని అడిగితే మా టీమ్ నాకు షేర్ చేస్తుంటారని, కొన్నిసార్లు తెలుగులో ఈ సినిమా ఇంత హిట్ కాలేదని అనిపిస్తుంది కానీ నాపై హిందీ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ మరింత బాధ్యత పెంచిందని అన్నారు.