Leading News Portal in Telugu

Navdeep: నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు..



Hero Navadeep

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో సినీ నటుడు నవదీప్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నవదీప్ ను నార్కోటిక్ బ్యూరో అధికారులు దాదాపు ఆరు గంటలుగా విచారించారు. ఇక, ఇవాళ ( శనివారం ) నవదీప్ విచారణ ముగిసింది అని నార్కోటిక్ అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా హీరో నవదీప్ మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసులో నాకు నోటీసులు ఇచ్చినందుకు నేను హాజరయ్యాను అని తెలిపాడు.

Read Also: China: యుద్ధానికి సిద్ధమవుతున్న చైనా.. సంచలన వ్యాఖ్యలు తెరమీదకు!

డ్రగ్స్ కేసులో హైదరాబాద్ కమినషర్ సీవీ ఆనంద్, ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో టీం బాగా పనిచేస్తోంది అని నవదీప్ ప్రశంసించారు. రామచంద్ అనే వ్యక్తి నాకు పరిచయం ఉన్నమాట వాస్తవమే.. కానీ, నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు అని అతడు చెప్పాడు. గతంలో ఒక పబ్ నిర్వహించినందుకు నన్ను పిలిచి విచారించారు.. గతంలో సిట్, ఈడీ విచారించింది ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో విచారించింది అని నవదీప్ పేర్కొన్నారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను.. అవసరం ఉంటే మళ్లీ పిలుస్తామని చెప్పారు అని అతడు వెల్లడించాడు. నవదీప్ ఫోన్ ను నార్కోటిక్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ లీస్ట్ ముందుంచి విచారించిన పోలీసులు.. వాట్సప్ చాటింగ్ ను అధికారులు రిట్రీవ్ చేయనున్నారు. డాటా అందిన తర్వాత మరో మారు నవదీప్ ను నార్కోటిక్ బ్యూరో అధికారులు విచారించనున్నారు.