మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ పోలీసుల ఎదుట హాజరై విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నవదీప్ ను నార్కోటిక్ బ్యూరో అధికారులు గత ఐదు గంటలుగా విచారిస్తున్నారు. దేవరకొండ సురేష్, రామచంద్రలతో పరిచయాలపై నార్కోటిక్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. సురేష్, రామచంద్ర అకౌంట్లోకి నవదీప్ డబ్బులు బదిలీ చేసిన దానిపై విచారణ చేస్తున్నారు. డబ్బుల బదిలీపైనా నవదీప్ ని నుంచి నార్కోటిక్ బ్యూటీ వివరాలు తెలుసుకుంటుంది. సురేష్ రామచంద్రలకు సంబంధించి ఆర్థిక లావాదేవులపై ప్రధానంగా ఆరా తీస్తున్నారు.
సినీ ఫైనాన్సర్ వెంకటరత్నారెడ్డితో ఉన్న పరిచయాలపై నార్కోటిక్ బ్యూరో అధికారులు ఆరా తీస్తున్నారు. మాదాపూర్ లో జరిగిన డ్రగ్ పార్టీలకు హాజరయ్యారాన్ని దానిపై విచారణ.. నవదీప్ పై గతంలో వచ్చిన ఆరోపణలపై కూడా నార్కోటిక్ బ్యూరో అధికారులు విచారణ చే జరుపుతున్నారు. పబ్ లో డ్రగ్స్ సరఫరాపై వివరాలు సేకరిస్తున్నారు. ఎవరి దగ్గర డ్రగ్స్ కొంటున్నారనే కోణంలో నార్కోటిక్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే, ఈ కేసులో నవదీప్‌ను వినియోగదారుడిగా నార్కోటికి బ్యూరో చేర్చింది. ఆయన ద్వారానే సినీ పరీశ్రమకు డ్రగ్స్ సరఫరా అయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో యాక్టర్ నవదీప్‌ను పోలీసులు 37వ నిందితుడిగా పేర్కొన్నారు. ఇప్పటికే ఆయన ఇంట్లో నార్కోటిక్స్ పోలీసులు రైడ్స్ చేశారు. కాగా, నవదీప్ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. పోలీసుల విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసుల ముందుకు హాజరయ్యారు.