Leading News Portal in Telugu

Hyderabad Crime: మాయ మాటలు చెప్పి బాలికపై గ్యాంగ్ రేప్


చిన్నారులపై, మహిళలపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. చాకెట్లు ఇస్తామని నమ్మించి అభం శుభం తెలియని చిన్నారులపై కూడా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. దేశంలో ఏదో ఓ మూల ప్రతిరోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చుట్టు పక్కల వారు, చుట్టాలు, చివరికి కన్న తండ్రి, తండ్రి వరుస, అన్న వరుస అయ్యేవారు కూడా ఆడవారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మేడిపల్లిలో ఓ మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తరుచుగా గంజాయి సేవించే అలవాటు ఉన్న వారు బాలికను ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసినట్లు తెలుసుస్తోంది. దీనికి సంబంధించి బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.